Skip to main content

Lok Sabha passes Jan Vishwas Bill: లోక్‌సభలో జన్‌ విశ్వాస్‌ బిల్లు ఆమోదం

ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు జన్‌ విశ్వాస్‌(నిబంధనల సవరణ) బిల్లు-2023కి లోక్‌సభ ఆమోదం తెలిపింది.
Lok-Sabha-passes-Jan-Vishwas-Bill
Lok Sabha passes Jan Vishwas Bill

ఈ బిల్లు ద్వారా 19 మంత్రిత్వ శాఖలు/విభాగాలు నిర్వహించే 42 కేంద్ర చట్టాలలో 183 నిబంధనలకు మార్పులు చేసే అవకాశం లభిస్తుంది.ఈ బిల్లును 2022 డిసెంబర్ 22న లోక్‌సభలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత, ఇది పార్లమెంటు సంయుక్త కమిటీకి సిఫార్సు చేయబడింది.

☛☛ Rajasthan minimum income Bill: రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు, 2023

జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2022పై జాయింట్ కమిటీ శాసనసభ విభాగం, న్యాయ వ్యవహారాల శాఖతో పాటు మొత్తం 19 మంత్రిత్వ శాఖలు/విభాగాలతో వివరణాత్మక చర్చలు జరిపింది. కమిటీ 09.01.2023, 17.02.2023 మధ్య బిల్లును పరీక్షీంచింది. చివరకు 13.03.2023న జరిగిన సమావేశంలో కమిటీ తన నివేదికను ఆమోదించింది.

☛☛ Rajasthan Honour Of Dead Body Bill 2023: రాజస్తాన్‌లో ‘ది రాజస్థాన్‌ ఆనర్‌ ఆఫ్‌ డెడ్‌ బాడీ బిల్లు చట్టం

Published date : 28 Jul 2023 05:58PM

Photo Stories