Rajasthan minimum income Bill: రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు, 2023
Sakshi Education
రాష్ట్రంలోని మొత్తం వయోజన జనాభాకు వేతనాలు లేదా పింఛను హామీని అందించే లక్ష్యంతో రాజస్థాన్ అసెంబ్లీ ‘రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు, 2023’ని ఆమోదించింది.
ఈ బిల్లును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ "సాటిలేని, చారిత్రాత్మకమైనది" అని ప్రశంసించారు, ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా, ప్రతి సంవత్సరం 125 రోజుల ఉపాధి హామీని పొందగలుగుతారు. వృద్ధులు/వికలాంగులు/ఒంటరి మహిళలు మొదలైన వారికి కనీసం నెలకు రూ. 1,000 పెన్షన్ లభిస్తుంది. ప్రతి సంవత్సరం పెన్షన్ 15 శాతం పెరగనుంది.
☛☛ Daily Current Affairs in Telugu: 21 జులై 2023 కరెంట్ అఫైర్స్
Published date : 22 Jul 2023 04:43PM