Daily Current Affairs in Telugu: 21 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా రూ.193.64 కోట్లను తిరుపతి వెంకటగిరిలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన సీఎం జగన్.
2. పశువైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన ఏపీకి ప్రతిష్టాత్మకమైన ‘ఇండియా యానిమల్ హెల్త్ లీడర్‌షిప్ అవార్డు–2023’ వరించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 20 జులై 2023 కరెంట్ అఫైర్స్
3. తమిళనాడులోని మహేంద్రగిరిలో గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రపొల్షన్ సిస్టం (ఎస్‌ఎంపీఎస్)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది.
4. జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల్లో ‘స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’గా చంద్రగిరికి చెందిన 'సంజన సంసర్వాల్' మిస్ ఇండియా కిరీటం కైవశం చేసుకుంది.
5. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–సీటీఆర్‌ఐ) ద్వారా దక్షిణ, ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బర్లీ ప్రాంతాలకు అనువైన 3 అధిక దిగుబడులను ఇచ్చే పొగాకు వంగడాలు విడుదలయ్యాయని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐ డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ గురువారం తెలిపారు.
☛☛ Daily Current Affairs in Telugu: 19 జులై 2023 కరెంట్ అఫైర్స్
6. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు ఉచిత గృహ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో 'గ్రామీణ ఆవాస్ న్యాయ్ యోజన' పేరుతో కొత్త గృహనిర్మాణ పథకాన్ని జూలై 19న ప్రారంభించింది.
7. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఫ్యూచర్ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధిని అందించాల్సి ఉందని, ఆ మేరకు పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళికకు రూపకల్పన చేయాలని హైపవర్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
8. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా దిల్లీకి చేరుకున్నారు.
☛☛ Daily Current Affairs in Telugu: 18 జులై 2023 కరెంట్ అఫైర్స్