Animal Health Leadership Award: ఏపీకి యానిమల్ హెల్త్ లీడర్‌షిప్ అవార్డు
Sakshi Education
రాష్ట్రానికి వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మకమైన ‘ఇండియా యానిమల్ హెల్త్ లీడర్‌షిప్ అవార్డు–2023’ వరించింది.
పశువైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన ఏపీకి ఈ అవార్డు దక్కింది. వివిధ రంగాల్లో అద్భుత పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాలు, శాఖలకు అగ్రికల్చర్ టుడే గ్రూప్ రెండో ఎడిషన్‌లో ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఈనెల 26న జరగనున్న ఇండియా యానిమల్ హెల్త్ సమ్మిట్–23లో రాష్ట్రానికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.
☛☛ YSR Netanna Nestam: తిరుపతి వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం
దేశంలోనే తొలిసారి రూ.7 కోట్లతో ఏర్పాటుచేసిన టెలిమెడిసిన్ కాల్‌సెంటర్ ద్వారా శాస్త్రవేత్తలు, పశు వైద్యాధికారుల ద్వారా పాడి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో 154 వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్ ద్వారా సకాలంలో వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నారు.
Published date : 21 Jul 2023 12:59PM