Central Tobacco Research Institute: కొత్త పొగాకు వంగడాల విడుదల
ఎఫ్‌సీఆర్–15 (సీటీఆర్‌ఐ శ్రేష్ట) వంగడం దక్షిణ తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది అధిక దిగుబడిని (హెక్టార్‌కు 3,000 కిలోలు) ఇస్తుందన్నారు. ఇది శీతాఫల తెగులు తట్టుకునే బ్యారన్ పొగాకు రకమన్నారు.
ఎఫ్‌సీజే–11 (సీటీఆర్‌ఐ నవీన) వంగడం ఉత్తర తేలిక నేలలకు అనువైనదన్నారు. ఇది కూడా ఎక్కువ దిగుబడినిచ్చే (హెక్టార్‌కు 3,300 కిలోలు) వంగడమని పేర్కొన్నారు. తక్కువ నత్రజనితో సాగు సామర్థ్యం కలిగిన బ్యారన్ పొగాకు రకమన్నారు. వైబీ–22 (విజేత) వంగడం అధిక దిగుబడినిచ్చే (హెక్టార్‌కు 2,900 కిలోలు), శీతాఫల తెగులు తట్టుకునే బర్లీ పొగాకు రకమన్నారు. ఈ 3 వంగడాలను స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ (ఎస్‌వీఆర్‌సీ) విడుదల చేసిందన్నారు. ఈ వంగడాల విత్తనాలు ప్రస్తుత సీజన్‌లో సీటీఆర్‌ఐలో లభ్యమవుతున్నాయని చెప్పారు.
☛☛ New seeds developed by NG Ranga Agriculture: ఏపీ మార్కెట్‌లోకి కొత్త విత్తనాలు