Skip to main content

New seeds developed by NG Ranga Agriculture: ఏపీ మార్కెట్‌లోకి కొత్త విత్తనాలు

రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి.
New seeds developed by NG Ranga Agriculture
New seeds developed by NG Ranga Agriculture

వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్‌లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

వేరుశనగలో..

టీసీజీఎస్‌ 1522: ఈ వంగడం కదిరి–6కు ప్రత్యామ్నాయం. తిరుపతి 4 ఎక్స్, కదిరి 9 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం ఖరీఫ్‌లో 100 నుంచి 103 రోజులు, రబీలో 103 నుంచి 106 రోజులు. దిగుబడి హెక్టార్‌కు ఖరీఫ్‌లో 3.328 టన్నులు, రబీలో 4.031 టన్నులు.

☛☛ NITI Aayog ‘National Multidimensional Poverty Index': ఏపీలో త‌గ్గిన పేద‌రికం..

పొగాకులో..

ఏబీడీ 132(నంద్యాల పొగాకు–2): ఈ వంగడం నంద్యాల పొగాకు–1కు ప్రత్యామ్నాయం. లైన్‌ 3–58–38, ఎక్స్‌ లైన్‌ (190–27–5–7–32), ఎక్స్‌ (303–3–38–13–11–40) రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది తక్కువ హాని కారకాలను కలిగి ఉంటుంది. కిలో ఆకు ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతుంది. 

పెసరలో.. 

ఎల్‌జీజీ 630: ఈ వంగడం ఎల్‌జీజీ 460, ఐపీఎం 2–14, టీఎం 96–2 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్‌జీజీ 460 ఎక్స్‌ పీ 109 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. 

మినుములో..

టీబీజీ 129: ఈ వంగడం ఎల్‌బీజీ 752కు ప్రత్యామ్నాయం. దీనిని పీయూ 31 ఎక్స్‌ ఎల్‌బీజీ 752 నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. 
ఎల్‌బీజీ 904: ఈ వంగడం ఎల్‌బీజీ 752, 787, పీయూ 31, టీబీజీ 104, జీబీజీ 1 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్‌బీజీ 645 ఎక్స్‌ టీయూ 94–2 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 2.20 నుంచి 2.50 టన్నులు. .

☛☛ Niti Aayog Rankings in Aspirational Districts: నీతి ఆయోగ్‌ టాప్‌ లిస్ట్‌లో వైఎస్సార్‌ జిల్లా

నూతన వంగడాలు.. వాటి ప్రత్యేకతలు

​​​​​​​బీపీటీ 2841: ఈ వంగడం బర్మా బ్లాక్, కాలాబట్టి సాంప్రదాయ బ్లాక్‌ రైస్‌కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–7029, ఐఆర్‌జీసీ 18195, ఎంటీయూ–1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 5.50 నుంచి 6 టన్నులు. 
బీపీటీ 2846: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1061, ఐఆర్‌ 78585–64–2–4–3–1 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 నుంచి 150 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. 
ఎన్‌ఎల్‌ఆర్‌ 3238: బయో ఫోర్టిఫైడ్‌ స్వల్పకాలిక వరి రకమిది. బీపీటీ–5204, ఎంటీయూ 1010 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. 
ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. 

ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు.

☛☛ NITI Aayog ‘Export Preparedness Index Rankings 2022: నీతి ఆయోగ్‌ ఎగుమతుల సన్నద్ధత సూచీ 2022 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ స్థానం ఎంతంటే..

Published date : 20 Jul 2023 03:22PM

Photo Stories