Skip to main content

Future Technology Skills: ఫ్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌పై సీఎం జగన్‌ సమీక్ష

పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఫ్యూచర్‌ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధిని అందించాల్సి ఉందని, ఆ మేరకు పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళికకు రూప­కల్పన చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
Future Technology Skills
Future Technology Skills

ఇందుకు అనుగుణంగా బోధ­నలో, శిక్ష­ణలో ఫ్యూచర్‌ టెక్నాలజీ వినియోగంపై కార్యా­చరణ రూపొందించాలని ఆదేశించారు. ఫ్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌పై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హైపవర్‌ వర్కింగ్‌ గ్రూపుతో సమావేశం అయ్యారు. విద్యా శాఖ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, డేటావివ్‌ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఐబీ (ఇంటర్‌నేషనల్‌ బాకలారియేట్‌)తో కలిసి ఒక కొత్త సిలబస్‌ను రూపొందించబోతున్నామని, అది దేశానికే బెంచ్‌ మార్క్‌ కాబోతుందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఐబీ, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌తో కలిసి టీచింగ్‌ మెథడాలజీని, పాఠ్య ప్రణాళికను మార్చబోతున్నామని సీఎం జగన్ తెలిపారు

☛☛ UGC guidelines for translation of books: ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య

Published date : 21 Jul 2023 05:23PM

Photo Stories