Skip to main content

UGC guidelines for translation of books: ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య

ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత నివ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిర్ణయించింది.
UGC guidelines for translation of books
UGC guidelines for translation of books

ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్ళేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రాల పరిధి లోని ఉన్నతవిద్య పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేయాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ఈ నిర్ణ యం తీసుకున్నట్టు పేర్కొంది.
కీలక మైన ఉన్నత విద్య లో ప్రమాణాలు మెరుగవ్వాలంటే, బోధన, పాఠ్య పుస్తకాలు స్థానిక భాషల్లోనే ఉండాలని కేంద్రం జరిపిన అధ్యయ నాల్లో వెల్లడైంది. దీనివల్ల సబ్జెక్టుపై విద్యార్థులకు పట్టు లభిస్తుందని, ఫ‌లితంగా విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసేలోగా మార్కెట్‌ అవసరాలకు అనువైన నైపుణ్యాన్ని సంపాదిస్తాడని ఎన్‌ఈపీ–2020లో పేర్కొన్నారు.

☛☛ Daily Current Affairs in Telugu: 18 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుగా పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో తర్జుమా చేయాలని భావించారు. దీనికోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీ) ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెక్నాలజీ ఆధారంగా ‘అనువాదిని’ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలూ ఉపయోగించుకుని డిగ్రీ, ఇంజనీరింగ్‌తో పాటు అన్ని రకాల ఉన్నత విద్య పాఠ్యపుస్తకాలను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో తర్జుమా చేయాలని సూచించింది.

అయితే, ఇంగ్లిష్, స్థానిక భాషను ఎంచుకోవడం విద్యార్థి ఐచ్ఛికమే. తెలుగు మీడియం ఉంటే ప్రత్యేక తరగతి బోధన చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాల తర్జుమాకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటూ యూజీసీ  మార్గదర్శకాలు విడుదల చేసింది. 

☛☛ NITI Aayog ‘National Multidimensional Poverty Index': ఏపీలో త‌గ్గిన పేద‌రికం..

Published date : 19 Jul 2023 03:17PM

Photo Stories