Skip to main content

Daily Current Affairs in Telugu: 18 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
july 18 daily Current Affairs
july 18 daily Current Affairs

1. నీతి ఆయోగ్‌ ప్రకటించిన‌ ఎగుమతుల సన్నద్ధత సూచీ 2022 ర్యాంకుల్లో  ఆంధ్రప్రదేశ్‌ 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

exports


 నీతి ఆయోగ్‌ ఏటా ప్రకటించే ఎగుమతుల సన్నద్ధత సూచీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరీ సోమవారం విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోస్థానం ఎగబాకింది.
ఈ ర్యాంకుల్లో 80.89 పాయింట్లతో తమిళనాడు మొదటిస్థానంలో నిలిస్తే, ఆ తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (78.20), కర్ణాటక (76.36), గుజరాత్‌ (73.22), హరియాణ (63.65), తెలంగాణ (61.36), ఉత్తరప్రదేశ్‌ (61.23) ఉన్నాయి. 
 ఆకాంక్షాత్మక జిల్లాల Aspirational Districts డెల్టా ర్యాంకింగ్ మే 2023 విభాగంలో వైఎస్సార్‌ జిల్లా మూడో స్థానంలో నిలిచింది.

2. భారత్‌లో ఐదేళ్ల కాలంలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డార‌ని నీతి ఆయోగ్‌ ‘జాతీయ బహుళ కోణ పేదరిక సూచీ 2023’ తాజా నివేదికలో వెల్ల‌డించింది

niti aayog


 భారత్‌లో ఐదేళ్ల కాలంలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డార‌ని నీతి ఆయోగ్‌ ‘జాతీయ బహుళ కోణ పేదరిక సూచీ 2023’ తాజా నివేదికలో వెల్ల‌డించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లలో పేదరికం అత్యంత వేగంగా తగ్గుతోందని తేలింది. ‘జాతీయ బహుళ కోణ పేదరిక సూచీ (MPI): 2023’ పేరిట నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెరీ ఈ నివేదికను విడుదల చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) (2019-21) వివరాల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు.. ఈ మూడు అంశాల్లోని పోషకాహారం, శిశుమరణాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, బ్యాంకు ఖాతాల వంటి 12 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు.
‘దేశంలోని పేదల శాతం 2015-16లో 24.85గా ఉండగా, 2019-21 నాటికి 14.96 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 32.59 శాతం నుంచి 19.28 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో 8.65 శాతం నుంచి 5.27 శాతానికి తగ్గింది. పేదరిక తీవ్రత 47 శాతం నుంచి 44 శాతానికి తగ్గింది. ఈ ఐదేళ్లలో ఎంపీఐ విలువ 0.117 నుంచి సగానికి (0.066) తగ్గింది. తద్వారా ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1.2 (పేదరికాన్ని 2030 నాటికి కనీసం సగానికి తగ్గించడం)ను ముందుగానే సాధించే దిశగా భారత్‌ పురోగమిస్తోందని ‘నీతి ఆయోగ్‌’ తెలిపింది. పారిశుద్ధ్యం, పాఠశాల విద్య, పోషకాహారం, వంట ఇంధనం వంటి సౌకర్యాలను ప్రభుత్వం మెరుగుపరచడంతో.. ఈ పురోగతి సాధ్యమైందని నీతి ఆయోగ్ పేర్కొంది.

☛☛ Daily Current Affairs in Telugu: 17 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

3.  జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్లో అభినవ్‌ షా-గౌతమి బానోత్‌ స్వర్ణం సాధించారు .

junior world cup shooting


 జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్లో 10 మీటర్ల మిక్స్‌డ్‌ ఎయిర్‌రైఫిల్‌ టీమ్‌ విభాగంలో అభినవ్‌ షా-గౌతమి బానోత్‌ స్వర్ణం సాధించారు. July 17 జరిగిన ప్రపంచకప్‌ షూటింగ్‌ ఫైనల్లో అభినవ్‌-గౌతమి 17-13తో ముల్లర్‌-రొమెయిన్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించారు.  
మరోవైపు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో అభినవ్‌ చౌదరి-సైన్యం కాంస్యం సాధించారు. కంచు పోరులో అభినవ్‌ ద్వయం 17-11తో కిమ్‌ జురి-కిమ్‌ కాంగ్‌యున్‌ (కొరియా) జోడీపై విజయం సాధించింది. ఈ పోటీల్లో భారత్‌ మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో రెండో స్థానంలో ఉంది. చైనా (3 స్వర్ణ, 2 రజత, 1 కాంస్యం) అగ్రస్థానంలో ఉంది.

4. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వా­ర్షిక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదు­గా గోల్డ్‌ మెడల్ అందుకున్న‌ డాక్టర్‌ గోపరాజు సమరం, డాక్టర్‌ అంబటి నటరాజ్‌

red cross award


 రెడ్‌క్రాస్‌ సొసైటీ తరఫున ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్న సేవలకుగాను  డాక్టర్‌ గోపరాజు సమరంకు , తెలంగాణల్లో చేస్తున్న సేవలకుగాను డాక్టర్‌ అంబటి నటరాజ్‌ల‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బంగారు పతకాలు అందించారు. July 17న‌ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్రపతి వారికి పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, 9 రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కర్నూలులో జన్మించిన డాక్టర్‌ అంబటి నటరాజ్‌ 1990 నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెడ్‌క్రాస్‌ సొసైటీ తరఫున సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆ జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌గా ఆయన ఇప్పటివరకూ రక్తదాన శిబిరాల ద్వారా 91 వేల బ్లడ్‌ యూనిట్లు సేకరించారు. వ్యక్తిగతంగానూ 1984 నుంచి 2023 వరకు 154 సార్లు రక్తదానం, ఆరుసార్లు ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ దానం చేశారు. 
కృష్ణా జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్న డాక్టర్‌ సమరం 19 ఏళ్లుగా ఆ సంస్థ తరఫున సేవలందిస్తున్నారు. రెడ్‌క్రాస్‌ శాఖలు ఏర్పాటు చేయడం, కొత్తవారిని సభ్యులుగా చేర్చడం, విపత్తులు, కొవిడ్‌ మహమ్మారి సమయంలో రూ.25 లక్షల విరాళాలు సేకరించి సామాజిక సేవకోసం వెచ్చించారు. 

☛☛ Daily Current Affairs in Telugu: 15 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ కమిటీలు, జాయింట్‌ కమిటీల నియామకం.

ap assembly commities


  ఆంధ్ర‌ప్ర‌దేశ్ పలు అసెంబ్లీ కమిటీలు, జాయింట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి July 17న రెండు బులెటిన్లు విడుదల చేశారు.
అసెంబ్లీ ప్రివిలేజెస్‌ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రివిలేజెస్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రివర్గంలో చేరడంతో ఆయన స్థానంలో కరుణాకర్‌రెడ్డిని నియమించారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కోన రఘుపతి,  అబ్బయ్యచౌదరి,  సుధాకర్‌బాబు, వెంకట చినఅప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్‌ను నియమించారు.
రూల్స్‌ కమిటీ చైర్మన్‌గా స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పిటిషన్స్‌ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, హామీల కమిటీ చైర్మన్‌గా కైలే అనిల్‌కుమార్, ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా శిల్పా చక్రపాణిరెడ్డిని నియమించారు.  అసెంబ్లీ, కౌన్సిల్‌కు పలు జాయింట్‌ కమిటీలను కూడా నియమించారు.
ఎమినిటీస్, వన్యప్రాణి–పర్యావరణ ప­రి­రక్షణ కమిటీల చైర్మన్‌గా తమ్మినేని, ఎస్సీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా గొల్ల బాబూరావు, ఎస్టీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా  బాలరాజు, మైనారిటీ­ల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా ముస్తఫా, మహిళ, శిశు, ది­వ్యాం­గులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్‌­పర్స­న్‌­గా జొన్న­లగడ్డ పద్మావతి, సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమి­టీ చైర్మన్‌గా మర్రి రాజశేఖర్, బీసీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా రమేష్‌యాదవ్, లైబ్రరీ కమి­టీ చైర్మన్‌గా పి.రామసుబ్బారెడ్డిని నియమించారు.

6.  చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా రెండోసారి మూన్‌ మిషన్‌ కక్ష్య పెంపు.

chandrayaan-3


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌–3 రాకెట్‌ను July 14 తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) వేదికగా విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే.
 చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా ఇప్పటికే ఒకసారి మిషన్‌ కక్ష్యను పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు, రెండోసారి మూన్‌ మిషన్‌ కక్ష్యను పెంచే ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. భారత్‌ పంపిన ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి 41,603 కిలోమీటర్లు X 226 కిలోమీటర్ల దూరంలోగల కక్ష్యలో ఉందని బెంగుళూరులో జాతీయ అంతరిక్ష సంస్థ తెలిపింది. July 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య మరోసారి స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్‌లను మండించి కక్ష్యను మరింత పెంచనున్నట్లు పేర్కొంది.

☛☛ Daily Current Affairs in Telugu: 14 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

7. భారత్‌ నుంచి  తరలించిన కళాఖండాలను  తిరిగి అప్పగించిన అమెరికా..

sculptures


న్యూయార్క్‌లోని భారత్‌ కాన్సులేట్‌లో జరిగిన కార్యక్రమంలో భారత్‌ నుంచి పలు సందర్భాల్లో తరలించిన 105 కళాఖండాలను అమెరికా తిరిగి అప్పగించింది, రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు వాటిని స్వీకరించారు. ఇందులో 2వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకూ ఉన్న కళాఖండాలున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన‌ సందర్భంగా వాటిని వెనక్కి ఇచ్చేస్తామని అమెరికా ప్రకటించింది. అందులో భాగంగానే వాటిని భారత్‌కు అప్పగించింది. ఈ కళాఖండాలన్నీ టెర్రాకోట్‌, రాయి, లోహం, చెక్కతో తయారు చేశారు.వాటిలో తూర్పు భారతానికి చెందినవి 47, దక్షిణ భారతానికి చెందినవి 27, మధ్య భారతానికి చెందినవి 22, ఉత్తర భారతానికి చెందినవి 6, పశ్చిమ భారతానికి చెందినవి 3 ఉన్నాయి. 
8. అమెరికాలో మరొక ప్రవాస భారతీయురాలికి కీలక పదవి.. 
అమెరికా ప్రభుత్వంలో మరొ ప్రవాస భారతీయురాలికి కీలక పదవి ద‌క్కింది. ప్రెసిడెంట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌లో ప్రముఖ భారతీయ అమెరికన్‌ వ్యాపారి షమీనా సింగ్‌ను నియమించనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడికి ఈ ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌ సలహాలిస్తుంది.అమెరికా శ్వేతసౌధం షమీనా సింగ్ నియామ‌కానికి సంబంధించిన‌ ఒక ప్రకటనను వెలువరించింది. 

9. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, భారత జౌళి మంత్రిత్వ శాఖలు మ‌ధ్య అవగాహన ఒప్పందం..

textile park


 మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC), భారత జౌళి మంత్రిత్వ శాఖలు మహారాష్ట్రలోని అమరావతిలో PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్, అపెరల్ పార్క్ (PM MITRA పార్క్) ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
PM MITRA మెగా టెక్స్‌టైల్ పార్క్ ద్వారా ₹10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 300,000 ఉద్యోగ అవకాశాలను సృష్టించే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు.

10. అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం- July 18 

international mandela day

☛☛ Daily Current Affairs in Telugu: 13 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

 

Published date : 18 Jul 2023 05:33PM

Photo Stories