Daily Current Affairs in Telugu: 15 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్ చౌధరీ 9 నిమిషాల 38.76 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్‌లో ఉత్తరప్రదేశ్‌కే చెందిన శైలీ సింగ్ 6.54 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచింది. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో పంజాబ్‌కు చెందిన తజిందర్‌పాల్ సింగ్ తూర్ ఇనుప గుండును 20.23 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు.
2. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 73 కేజీల విభాగంలో అజిత్ స్వర్ణం సాధించాడు.
3. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతంగా భూ కక్షలోకి చేరుకుంది. చంద్రయాన్–3, 24 రోజుల పాటు భూ కక్షలో ఉండనుంది. 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుని మీద ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది.
4. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర సమాఖ్య 15వ కాన్ఫరెన్స్‌ను స్వాస్థ్య చింతన్ శివిర్ పేరుతో నిర్వహించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 14 జులై 2023 కరెంట్ అఫైర్స్
5. తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు సుజన కళాసికం, లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటిలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
6. ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఉన్న సితార్‌ను బహుకరించారు.
7. భారతీయులు యూపీఐ ద్వారా రూపాయిల్లో చెల్లింపులు చేసుకోవడానికి ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. భారత పర్యాటకులు ఈఫిల్ టవర్ నుంచే యూపీఐ ద్వారా రూపాయిల్లో చెల్లింపులు చేసుకోవచ్చు అని ప్రధాని తెలిపారు.
8. తమిళనాడు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు, నాబార్డ్ మధురై అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్ ఫోరమ్ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన ఆథూర్ తమలపాకులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) సర్టిఫికేట్‌ను ప్రదానం చేశాయి.
9. ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం- July 15
☛☛ Daily Current Affairs in Telugu: 13 జులై 2023 కరెంట్ అఫైర్స్
☛☛ For more Daily Current Affairs