Daily Current Affairs in Telugu: 13 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. విశాఖపట్నం సముద్ర తీర భద్రతపై 2 రోజుల పాటు ‘సాగర్ కవచ్’ కవాతు జరుగుతున్నది.
2. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది.
3. 2023 చివరికి రోజువారీగా 10 లక్షల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి) లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించారు.
4. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అథ్లెట్ 10 వేల మీటర్ల నడకలో అభిషేక్ పాల్ కాంస్యం గెలిచాడు.
☛☛ Daily Current Affairs in Telugu: 12 జులై 2023 కరెంట్ అఫైర్స్
5. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 49 కిలోల విభాగంలో భారత లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ స్వర్ణం సాధించింది. 176 కిలోలు ఎత్తి ఆమె ఆగ్రస్థానంలో నిలిచింది. మన దేశానికికే చెందిన జిల్లీ 169 కిలోలు (75కేజీ+కేజీ) ఎత్తి రజతం గెలుచుకుంది.
6. కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు.
7. సముద్ర రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘సాగర్ సంపార్క్’ డిఫరెన్షియల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు.
8. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 12వ పీఆర్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్‌సింగ్‌ను నియమించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 11 జులై 2023 కరెంట్ అఫైర్స్