Daily Current Affairs in Telugu: 11 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగాధిపతిగా పీఎస్‌ఆర్ ఆంజనేయులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
2. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన దేవాలయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ జస్పూర్ గ్రామంలో 504 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు.
3. మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే గెలుచుకుంది.
4. ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ (Israel) ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రాథమికంగా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది.
5. పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో(NATO)లో స్వీడన్ చేరికకు తుర్కియే(Turkey)కు అభ్యంతరం లేదని తెలిపిందని నాటో అధినేత జెన్స్ స్టోల్తెన్‌బర్గ్(Jens Stoltenberg)తెలిపారు .
☛☛ Daily Current Affairs in Telugu: 10 జులై 2023 కరెంట్ అఫైర్స్
6. 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి (Second Largest Economy)గా అవతరించనుందని ప్రముఖ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ (Goldman Sachs) అంచనా వేసింది.
7. ఫోర్బ్స్ అమెరికా తొలి వంద మంది సంపన్న మహిళల్లో పెప్సికో మాజీ ఛైర్మన్, సీఈఓ ఇంద్రా నూయీ, ఆరిస్టా నెట్‌వర్క్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్, సింటెల్ ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, కాన్‌ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే ఉన్నారు.
8. పెట్టుబడులకు అనుకూలమైన, అత్యంత ఆకర్షణీయమైన మార్కెట్‌ల జాబితాలో చైనాను భారత్ అధిగమించిందని ‘‘ఇన్వెస్కో గ్లోబల్ సావరిన్ అసెట్ మేనేజ్‌మెంట్ స్టడీ’’ అనే సంస్థ తన సర్వేలో తెలిపింది.
9. ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో మహారాష్ట్రకు చెందిన భారత ఆర్చరీ ప్లేయర్ పార్థ్ సాలుంకే, కొరియన్ ఆటగాడు ఏడో సీడ్ సంగ్ ఇంజున్‌ను ఓడించి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు.
10. ఉగాండాలో జరిగిన అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీకాకుళం అమ్మాయి పడాల రూపాదేవి సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో మూడు రజతాలు సాధించింది.
11. రక్షణ, సాంకేతిక రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకొనేందుకు వీలుగా 1993 నాటి కీలక అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) సవరించేందుకు భారత్, మలేసియా పరస్పరం అంగీకరించాయి
12. ప్రపంచ జనాభా దినోత్సవం - July 11.