Daily Current Affairs in Telugu: 12 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎవరైనా సెలువులో ఉంటే వారి స్థానంలో విద్యార్థులకు బోధన అందించేందుకు ప్రభుత్వం ‘క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్’ (సీఆర్‌ఎంటీ) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
2. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌డీపీ) యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి గ్లోబల్ మల్టిడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ)ని విడుదల చేసిన నివేదికలో భారత్‌లో 15 ఏళ్ల వ్యవధిలోనే దాదాపు 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది.
3. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్ర పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్ధమని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
4. అమెరికా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలిగా భారత సంతతికి చెందిన గీతారావ్ గుప్తాతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయించారు.
☛☛ Daily Current Affairs in Telugu: 11 జులై 2023 కరెంట్ అఫైర్స్
5. ఐర్లాండ్‌లోని ఇటీవల ముగిసిన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్ 2023లో ఆరు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలతో సహా 11 పతకాలతో భారతదేశం రెండవ స్థానంలో నిలివగా, దక్షిణ కొరియా ఆరు స్వర్ణాలు, నాలుగు రజత పతకాలతో సహా మొత్తం 10 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది.
6. మలేషియాలోని కౌలాలంపూర్‌లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ప్రాంతీయ కార్యాలయాన్ని రక్షా మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.
7. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA), క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ - ఇండియా (CPI) భారతదేశంలోకి ప్రపంచ స్థిరమైన మూలధన ప్రవాహాల సమీకరణను పెంచడానికి పరస్పర సహాయం, సహకారం కోసం అవగాహన ఒప్పందం (MoU)చేసుకున్నాయి.
8. ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం- July 12
9. అంతర్జాతీయ మలాలా దినోత్సవం- July 12
☛☛ Daily Current Affairs in Telugu: 10 జులై 2023 కరెంట్ అఫైర్స్