Daily Current Affairs in Telugu: 14 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. తిరుపతిలో రూ.2,900 కోట్ల మూడు జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.
2. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జాతీయ పురస్కారానికి డాక్టర్ జి.సమరం ఎంపికయ్యారు.
3. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ నవీన్‌రావు బాధ్యతలు చేపట్టారు.
☛☛ Daily Current Affairs in Telugu: 13 జులై 2023 కరెంట్ అఫైర్స్
4. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం(July 14) బాస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా మోదీ పాల్గొననున్నారు. ‘బాస్టిల్ డే ’ పరేడ్‌లో 68 మంది సభ్యులతో కూడిన ఐఏఎఫ్ బృందానికి భారతదేశపు స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు.
5. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) నుంచి పాకిస్థాన్‌కు 1.2 బిలియన్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.9,848 కోట్లు) అందినట్లు పాకిస్థాన్ ఆర్థికమంత్రి ఇషాక్‌దర్ వెల్లడించారు.
6. థాయిలాండ్ వేదికగా జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హార్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.
7. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్ర వెయిట్‌లిఫ్టర్ ఎస్.పల్లవి 64కేజీ విభాగంలో 193 కిలోలు ఎత్తి స్వర్ణ పతకం సాధించింది.
☛☛Daily Current Affairs in Telugu: 12 జులై 2023 కరెంట్ అఫైర్స్