Daily Current Affairs in Telugu: 17 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. 'నీలి బెండపూడి' భారత్, అమెరికా దేశాల మధ్య విద్యావిషయక అంశాలపై కోచర్‌గా నియమితులయ్యారు.
2. భారతదేశపు సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’ వరించింది. భారత్–అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్–టు–పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యూఎస్ ఇండియా ఎస్‌ఎంఈ కౌన్సిల్ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించింది.
3. భారత్–యూఏఈ వాణిజ్య చెల్లింపులను ఇకపై సొంత కరెన్సీలోనే చేపట్టాలని రెండు దేశాలునిర్ణయించుకున్నాయి.
4. ‘భారత్-నేపాల్ అభివృద్ధి భాగస్వామ్య కార్యక్రమం’ కింద నేపాల్‌లోని విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసుకోవడానికి మొత్తం 34 అంబులెన్సులు, 50 పాఠశాల బస్సులను బహుమతిగా నేపాల్ కు భారత్ అందించింది..
5. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 200 మీటర్ల హర్డిల్స్ విభాగంలో జ్యోతి యర్రాజీ 23.13 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది.
☛☛ Daily Current Affairs in Telugu: 15 జులై 2023 కరెంట్ అఫైర్స్
6. మహిళల 4400 మీటర్ల రిలేలో 'దండి జ్యోతికశ్రీ, హీనా మలిక్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్' బృందం 3 నిమిషాల 33.73 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది.
7. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది.
8. లండన్‌లో జరిగిన ‘వింబుల్డన్’ 2023 టైటిల్ విజేతగా 'కార్లోస్ అల్‌కరాజ్'(స్పెయిన్ ) నిలిచాడు.
9. దులీప్ ట్రోఫీ 2023 టైటిల్ విజేతగా సౌత్‌జోన్ జట్టు.
10. కొరియాలోని చాంగ్వాన్‌లో జారుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో పురుషుల విభాగంలో 'శుభమ్ బిస్లా', మహిళల విభాగంలో 'సైన్యం' పసిడి పతకాలు సాధించారు.
11. భారత్-మంగోలియా సంయుక్త సైనిక విన్యాసాలు “నోమాడిక్ ఎలిఫెంట్ - 2023” మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో జూలై 17 నుండి 31 వరకు జరగనున్నాయి.
12. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం July-17
☛☛ Daily Current Affairs in Telugu: 14 జులై 2023 కరెంట్ అఫైర్స్