Star MISS TEEN GLOBE INDIA 2023: స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’గా 'సంజన'
Sakshi Education
జులై 16న జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల్లో ‘స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’గా చంద్రగిరికి చెందిన 'సంజన సంసర్వాల్' మిస్ ఇండియా కిరీటం కైవశం చేసుకుంది.
SANJANA SANSARWAL
ఫైనల్స్‌లో 47 మంది పాల్గొనగా.. వారిలో స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియాగా సంజన ఎంపికైంది.2023 మేలో బెంగళూరులో ప్రిలిమినరీ రౌండ్‌లో 300 మందికి పైగా బాలికలు జూమ్ కాల్‌లో పాల్గొనగా.. ఫైనల్స్‌కు 57 మంది ఎంపికయ్యారు. వారిలో సంజన ఒకరు. ఈ నెల 16 నుంచి జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫైనల్‌లో 47 మంది పాల్గొనగా.. వారిలో సంజన మొదటి స్థానం పొందింది.