Skip to main content

Daily Current Affairs in Telugu: 20 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
July 20 daily Current Affairs in Telugu
July 20 daily Current Affairs in Telugu

1. ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్‌ కల్యంపూడి రాధాకృష్ణరావు (102)కు స్టాటిస్టిక్స్‌ రంగంలో  నోబెల్‌ అవార్డుగా భావించే  ఇంటర్నేషల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డు వరించింది.

2. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ అలోక్‌ అరాధేను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

☛☛ Daily Current Affairs in Telugu: 19 జులై 2023 క‌రెంట్ అఫైర్స్​​​​​​​

3. ఏపీ రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్‌లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు  పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

4. ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య’ పురస్కారాన్ని 2023 సంవత్సరానికి గాను  కామారెడ్డికి చెందిన ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర పండితుడు, అష్టావధాని అయాచితం నటేశ్వరశర్మకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

☛☛  Daily Current Affairs in Telugu: 18 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

5. సూరత్‌లో వజ్రాల వ్యాపార అవసరాలు తీర్చేందుకు అనువుగా రూ. 3,200 కోట్ల వ్యయంతో ‘సూరత్‌ డైమండ్‌ బౌర్స్‌’ అనే భవనాన్ని నిర్మించారు.

6. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) 25వ డైరెక్టర్ జనరల్‌గా డీజీ రాకేశ్ పాల్ నియమితులయ్యారు. 

7. ఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సంజన- హర్మేహర్‌ సింగ్‌ జోడీ రజతం గెలిచింది. 

8. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సత్పాల్‌ భానూను ప్రభుత్వం నియమించింది.

☛☛ ​​​​​​​ Daily Current Affairs in Telugu: 17 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 20 Jul 2023 07:25PM

Photo Stories