Cinematograph (Amendment) Bill, 2023: సినిమాటోగ్రఫీ(చట్ట సవరణ) బిల్లు–2023
సినిమాటోగ్రఫీ చట్టం–1952కు సవరణలు చేస్తూ.. తాజాగా సినిమాటోగ్రఫీ(చట్ట సవరణ) బిల్లు–2023ను కేంద్రం తీసుకొచ్చింది. దీనికిముందు సినిమాటోగ్రఫీ బిల్లును జూలై 27న రాజ్యసభ ఆమోదించింది. దీనిద్వారా పైరసీ చేసిన సినిమాలు ఇకపై ఇంటర్నెట్‌లో కనిపించకుండా అడ్డుకట్ట పడనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) సినిమాలకు జారీ చేసే సర్టిఫికెట్ల విధానంలోనూ మార్పులు జరగనున్నాయి. యూ, యూ/ఏ, ఏ, ఎస్‌సర్టిఫికెట్ల స్థానంలో ఇకపై వయసు ఆధారిత సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.
☛☛ Lok Sabha passes Jan Vishwas Bill: లోక్‌సభలో జన్ విశ్వాస్ బిల్లు ఆమోదం
ఈ బిల్లు ప్రకారం పైరసీకి పాల్పడినవారికి కనీసం 3 నెలల జైలు శిక్ష, రూ. 3 లక్షలు జరిమానా, జైలు శిక్ష 3 సంవత్సరాల వరకు పొడగించవచ్చు, వ్యయంలో 5% వరకు జరిమానా విధించవచ్చు.
☛☛ Data Protection Bill: డేటా పరిరక్షణ బిల్లుకి కేంద్రం ఆమోదం