Data Protection Bill: డేటా పరిరక్షణ బిల్లుకి కేంద్రం ఆమోదం
Sakshi Education
డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు (డీపీడీపీ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
జూలై 20 నుంచి ఆగస్టు 11 దాకా జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లును ప్రవేశపెడతారని అధికార వర్గాల సమాచారం.
గోప్యత హక్కులో భాగంగా పౌరుల డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ విషయంలో ఇంటర్నెట్ కంపెనీలు, మొబైల్ యాప్స్, వ్యాపార సంస్థల్లో జవాబుదారీతనం పెంచడం దీని లక్ష్యం. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గత ఆగస్టులో సుప్రీంకోర్టు ప్రకటించిన అనంతరం డేటా పరిరక్షణ బిల్లు తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు డేటా సేకరణకు ముందు పౌరుల అనుమతి తీసుకోవాలి.
☛ Supreme Court CJ's: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ భూయాన్, జస్టిస్ ఎస్‌వీ భట్టి
Published date : 06 Jul 2023 07:21PM