India-Pakistan Border: సరిహద్దు వెంట డ్రోన్ల కలకలం
Sakshi Education
సరిహద్దు వెంట గగనతల మార్గంలో మాదకద్రవ్యాల సరఫరాకు యత్నించిన పాకిస్తాన్ కుట్రను భారత సైన్యం భగ్నంచేసింది.

పంజాబ్‌లోని అమృత్‌సర్, తారన్‌తరణ్ జిల్లాల్లో చక్కర్లు కొడుతున్న రెండు పాక్ డ్రోన్లను కూల్చేసింది. ఇవి 10 కేజీల హెరాయిన్‌ను మోసుకొచ్చాయని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో ఒక డ్రోన్‌ను అమృత్‌సర్ దగ్గర్లోని ఛాహర్‌పూర్ గ్రామం వద్ద నవంబర్ 28న మహిళా జవాన్లు కూల్చేయగా రెండోదాన్ని కలశ్ హవేలియాన్ సమీపంలో కూల్చారు. వదాయ్ చీమా సరిహద్దు పోస్ట్ వద్ద మూడో డ్రోన్ చక్కర్లు కొట్టింది. దానిపై కాల్పులు జరపగా పాక్ భూభాగం వైపు వెనుతిరిగింది.
➤ ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానం ఎగిరిందిలా.. దీని ప్రత్యేకతలు ఇవే..
Published date : 30 Nov 2022 02:00PM