High Level Committee : రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ!
Sakshi Education
పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు డిమాండ్లతో శంభు సరిహద్దు వద్ద నిరవధిక నిరసనను కొనసాగిస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. అయిదుగురు సభ్యుల కమిటీకి పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ చైర్ పర్సన్‌గా వ్యవహరించనున్నారు.
Alberto Fujimori: పెరూ మాజీ అధ్యక్షుడు ఫుజిమొరి కన్నుమూత.. ఆయన జీవిత చరిత్ర ఇదే..!
జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల మధ్య శంభు సరిహద్దు వద్ద రహదారిపై అడ్డుగా పెట్టిన ట్రాక్టర్లు, ట్రాలీలను తక్షణమే తొలగించేలా రైతులను ఒప్పించాలని తెలిపింది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ సూచనలను కమిటీకి తెలియజేయవచ్చని ధర్మాసనం పేర్కొంది.
Published date : 14 Sep 2024 09:25AM