Bharat Instead of India: ఇకపై ఇండియా కాదు..భారత్ అనాల్సిందే?
జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్‌కు పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండటంతో వివాదం మొదలైంది. ఈ పరిణామంతో మోడీ ప్రభుత్వం ఇండియా పేరును ‘భారత్’గా మారుస్తారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
G20 Summit 2023: ఒకే వసుధ ఒకే కుటుంబం ఒక సదస్సు
అసలేం జరిగిందంటే..
భారత్ అధ్యక్షతన సెప్టెంబరు 9,10వ తేదిలలో రెండు రోజుల పాటు ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కోసం రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై President of India అని కాకుండా President of Bharat అని ముద్రించారు.
G20 Summits: జి20 సదస్సులు.. ఢిల్లీ లాక్ డౌన్
అటు జీ-20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ దేశం పేరు ‘భారత్’ అని పేర్కొన్నారు. ‘భారత్, మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని అందులో రాశారు. ఈ ఆహ్వాన పత్రికను అందుకున్న కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఇండియాను భారత్‌గా మార్చడాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పేరు మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమికి భయపడి, కేవలం ఎన్నికల స్టంట్ కోసమే కేంద్రలోని బీజేపీపేరు మార్చేందకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు.