White Revolution 2.0: శ్వేత విప్లవం 2.0ను ప్రారంభించిన అమిత్ షా
ఈ కొత్త కార్యక్రమానికి "శ్వేత విప్లవం 2.0" అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు.
ఈ పథకం ద్వారా..
పాల ఉత్పత్తి పెరుగుదల: రాబోయే ఐదేళ్లలో పాల సేకరణను 50% పెంచాలనే లక్ష్యంతో సహకార సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
రైతులకు మద్దతు: పాల వ్యాపారుల కోసం రూపే కిసాన్ క్రెడిట్ కార్డులు, డెయిరీ కో-ఆపరేటివ్ సొసైటీలలో మైక్రో-ఏటీఎంల ఏర్పాటు ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
మహిళా సాధికారత: ఈ పథకం మహిళా సాధికారతను ప్రోత్సహించి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డేటా ఆధారిత నిర్ణయాలు: 67,930 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల కంప్యూటరీకరణ ద్వారా పాల ఉత్పత్తి రంగంలో మరింత సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
NPS Vatsalya Scheme: పిల్లల ఆర్థిక భవిష్యత్‌కు కొత్త పథకం ప్రారంభం