Skip to main content

World Water Day 2022 Theme: ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

World Water Day

ప్రతి నీటి చుక్కనూ పొదుపు చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో కొన్నేళ్లుగా నీటి సంరక్షణను ఉద్యమంలా కొనసాగిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. మార్చి 22న వరల్డ్‌ వాటర్‌ డే సందర్భంగా ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. నీటి  సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మార్చి 22న  ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నీటి పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించాలంటూ 1992లో రియో డి జనేరియోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణం మరియు అభివృద్ధి సదస్సు తీర్మానించింది. అలా 1993లో మొదటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో వరల్డ్‌ వాటర్‌ డేని నిర్వహించడం ఆనవాయితీ. 2022 ఏడాదికి సంబంధించి ’గ్రౌండ్‌ వాటర్‌: మేకింగ్‌ ది ఇన్విజిబుల్‌ విజిబుల్‌’ అనేది థీమ్‌. నానాటికి అదృశ్యమైన పోతున్న భూగర్భ జలాల్ని కాపాడుకోవడం అనే లక్ష్యంతో ఈ ఏడాది  ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించు కోవాలని ఐక్యరాజ్యసమతి పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అంద జేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

2021 World Air Quality Report: ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత రాజధాని నగరం ఏది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచ నీటి దినోత్సవ నిర్వహణ
ఎప్పుడు : మార్చి 22
ఎవరు    : ప్రపంచ దేశాలు...
ఎక్కడ    : ప్రపంచ వ్యాప్తంగా..
ఎందుకు : నీటి  సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ..

Starvation Deaths: ఆకలి కారణంగా నిమిషానికి ఎంత మంది మరణిస్తున్నారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Mar 2022 06:40PM

Photo Stories