Skip to main content

2021 World Air Quality Report: ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత రాజధాని నగరం ఏది?

Pollution

ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత రాజధాని నగరంగా భారత రాజధాని నగరం ఢిల్లీ నిలిచింది. స్విట్జర్‌ల్యాండ్‌కి చెందిన ఐక్యూ ఎయిర్‌ సంస్థ మార్చి 22న విడుదల చేసిన వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌–2021లో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితా తయారీకి 117 దేశాల్లోని 6,475 నగరాల్లో వాయు నాణ్యత (పీఎం 2.5– పర్టిక్యులేట్‌ మాటర్‌ 2.5 స్థాయి)ను సంస్థ పరిశీలించింది. వాయుకాలుష్యం శ్వాసకోశ ఇబ్బందులు, అలెర్జీల నుంచి క్యాన్సర్‌ తదితరాలకు దారితీస్తుంది.

Starvation Deaths: ఆకలి కారణంగా నిమిషానికి ఎంత మంది మరణిస్తున్నారు?

2021 వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ – ముఖ్యమైన అంశాలు​​​​​​​

  • ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ నిలిచింది. అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లో ఉండటం వరుసగా ఇది నాలుగోసారి.
  • కలుషిత రాజధానుల్లో ఢిల్లీ తర్వాత ఢాకా (బంగ్లాదేశ్‌), జమేనా (చాడ్‌ రిపబ్లిక్‌), దుషంబె (తజికిస్తాన్‌), మస్కట్‌ (ఒమన్‌) నిలిచాయి. 
  • అత్యంత అధమ వాయు నాణ్యత ఉన్న టాప్‌ 100లో 63 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నగరాలు ఉత్తరాదిన ఢిల్లీ పరిసరాల్లోనే ఉన్నాయి.
  • భారత్‌లో ఒక్క నగరంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారిత వాయు నాణ్యత ప్రమాణాలు(క్యూబిక్‌ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు) లేవు.
  • ఢిల్లీ పీఎం 2.5 స్థాయి క్రితంతో పోలిస్తే 14.6 శాతం పెరిగింది. ఢిల్లీ గాలిలో కాలుష్య స్థాయి క్యూబిక్‌ మీటర్‌కు 96.4 మైక్రోగ్రాములుగా నమోదైంది. 
  • భారత్‌ సరాసరి వార్షిక పీఎం 2.5 స్థాయి 2021లో క్యూబిక్‌ మీటర్‌కు 58.1 మైక్రో గ్రాములకు చేరింది.
  • కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో భారత్‌లో వాయునాణ్యత మెరుగైంది, కానీ 2021కల్లా వాయు నాణ్యత తిరిగి 2019 స్థాయికి పడిపోయింది.
  • భారత్‌లో 48 శాతం నగరాల్లో వాయు నాణ్యత క్యూబిక్‌ మీటర్‌కు 50 మైక్రో గ్రాములను దాటింది.

ప్రపంచంలో అత్యంత కలుషిత నగరం భివాడీ

  • ప్రపంచ టాప్‌ 15 కలుషిత నగరాల్లో పది నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. – ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా రాజస్తాన్‌లోని భివాడీ నగరం నిలిచింది. ఈ నగరంలో పీఎం 2.5 స్థాయి 106.2 మైక్రోగ్రామ్‌/క్యూబిక్‌ మీటర్‌గా నమోదైంది. 
  • భివాడీ తర్వాత స్థానాల్లో ఘజియాబాద్, చైనాకు చెందిన హోటాన్, ఢిల్లీ, జాన్‌పూర్, పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌ నిలిచాయి.
  • దేశాల వారీగా చూస్తే అత్యంత కాలుష్య దేశంగా పీఎం 2.5 స్థాయి 76.9 మైక్రోగ్రామ్‌/క్యూబిక్‌మీటర్‌తో బంగ్లాదేశ్‌ నిలిచింది. తర్వాత స్థానాల్లో చాడ్, పాకిస్తాన్, తజికిస్తాన్, భారత్‌ ఉన్నాయి.Pollution-Graph

​​​​​​​నాలుగో స్థానంలో హైదరాబాద్‌

  • భారత్‌లో అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది.
  • హైదరాబాద్‌ నగరంలో పీఎం 2.5 స్థాయిలు 2020లో క్యూబిక్‌ మీటర్‌కు 34.7 మైక్రోగ్రామ్‌ ఉండగా, 2021కి 39.4కు పెరిగింది. పెరుగుతున్న వాహన విక్రయాలు కాలుష్య పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో అధికారిక లెక్కల ప్రకారం 60 లక్షల వాహనాలున్నాయి.
  • ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేవలం 3 శాతం నగరాలు మాత్రమే డబ్లు్యహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా వాయునాణ్యతతో ఉన్నాయి. దేశాల వారీగా చూస్తే ఏ ఒక్క దేశంలో కూడా వాయు నాణ్యత నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేదు.

Russia-Ukraine War: శరణార్థులకు ఆశ్రయమిస్తే భత్యం అందజేస్తామని ప్రకటించిన దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 
అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ
ఎప్పుడు : మార్చి 22
ఎవరు    : ఐక్యూ ఎయిర్‌ సంస్థ విడుదల చేసిన వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌–2021 
ఎక్కడ    : ప్రపంచ దేశ రాజధానుల్లో..
ఎందుకు : అత్యధిక కాలుష్యం వల్ల.. వాయు నాణ్యత క్షీణించడంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Mar 2022 01:06PM

Photo Stories