Russia-Ukraine War: శరణార్థులకు ఆశ్రయమిస్తే భత్యం అందజేస్తామని ప్రకటించిన దేశం?
ఉక్రెయిన్ శరణార్థులకు ఇళ్లల్లో ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తే నెలకు 350 పౌండ్లు చొప్పున భత్యం అందజేస్తామని యునైటెడ్ కింగ్‌డమ్ ప్రకటించింది. కనీసం 6 నెలలపాటు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని మార్చి 13న యూకే హౌసింగ్ సెక్రెటరీ మైఖేల్ గోవ్ చెప్పారు. ఉక్రెయిన్ నుంచి ఎంతోమంది ప్రాణభయంతో తరలివస్తున్నారని పేర్కొన్నారు. వైద్య సేవలు, వారి పిల్లల స్కూళ్ల ఫీజులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. శరణార్థులు మూడేళ్లపాటు ఉండొచ్చని తెలిపారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీని ఏ దేశానికి మార్చనున్నారు?
మరో మేయర్‌ను అపహరించిన రష్యా!
దినిప్రొరుడ్నె నగర మేయర్ యెవ్‌హెన్ మాట్‌వెయెవ్‌ను మార్చి 13న రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటికే మెలిటోపోల్ సిటీ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా సైన్యం అపహరించినట్లు వార్తలు రావడం తెలిసిందే.
రష్యా దాడుల్లో అమెరికా జర్నలిస్టు మృతి
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఇర్పిన్‌లో రష్యా దాడుల్లో ప్రఖ్యాత ‘ద న్యూయార్క్ టైమ్స్’లో పనిచేసిన బ్రెంట్ రెనాడ్(51) మృతి చెందినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ పత్రిక మార్చి 13న వెల్లడించింది. మరో ఇద్దరు అమెరికా జర్నలిస్టులు గాయపడ్డారని తెలియజేసింది. అమెరికాకు చెందిన బ్రెంట్ రెనాడ్ సినీ దర్శకుడిగానూ పని చేస్తున్నారు.
ఉక్రెయిన్ సైన్యంలోకి... స్నైపర్ వలీ
‘రష్యాపై జరుగుతున్న యుద్ధంలో మాకు సహాయం చేయండి’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన విజ్ఞప్తి పట్ల కెనడా మాజీ సైనికులు సానుకూలంగా స్పందించారు. కెనడా రాయల్ 22వ రెజిమెంట్‌కు చెందిన పూర్వ సైనికులు ఉక్రెయిన్ సైన్యంలో చేరారు. వీరిలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్ వలీ కూడా ఉన్నారు. గతంలో ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులపై పోరాడిన కుర్దిష్ దళాలకు వలీ సాయం అందించారు. వలీ ఒక్కరోజులో కనీసం 40 మందిని హతమార్చగలడంటారు. 2017 జూన్‌లో ఇరాక్‌లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐసిస్ జిహాదిస్ట్‌ను సునాయాసంగా కాల్చి చంపాడు.
Russia-Ukraine war: నాటో కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్