Russia-Ukraine War: ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీని ఏ దేశానికి మార్చనున్నారు?
ఉక్రెయిన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) పొరుగు దేశం పోలండ్‌కు తాత్కాలికంగా మార్చాలని భారత్ నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో... మార్చి 13న భారత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ సిబ్బంది ఇప్పటికే లెవివ్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. లెవివ్ నగరం కూడా ఉక్రెయిన్‌లోనే ఉంది.
Russia-Ukraine War: యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
యుద్ధం 18వ రోజు..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మార్చి 13వ తేదీ నాటికి 18వ రోజుకు చేరుకుంది. రష్యా సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్‌తోపాటు ముఖ్య నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలనే కాదు, సాధారణ నివాస గృహాలను కూడా విడిచిపెట్టడం లేదు. కీవ్, మారియుపోల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. 2022, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించింది.
యారోవివ్ మిలటరీ రేంజ్ ఎక్కడ ఉంది?
పశ్చిమ ఉక్రెయిన్‌లోని లెవివ్ నగర సమీపంలో ఉన్న యారోవివ్ సైనిక శిక్షణా కేంద్రంపై మార్చి 13న రష్యా గగనతల దాడుల్లో 35 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు. పోలండ్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న యారోవివ్ మిలటరీ రేంజ్‌పై రష్యా సైన్యం రాకెట్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. దీన్ని యారోవివ్ ఇంటర్నేషనల్ పీస్‌కీపింగ్, సెక్యూరిటీ సెంటర్‌గానూ పిలుస్తారు. అమెరికా సైనికాధికారులు ఇక్కడ ఉక్రెయిన్ సైన్యానికి స్వయంగా శిక్షణ ఇస్తుంటారు. ఈ మిలటరీ రేంజ్‌లో నాటో దేశాల సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి.
Russia-Ukraine Conflict: ఈ యుద్ధం వెనుక ఏముంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్