UNGA adopts resolution on multilingualism, mentions Hindi language for first time: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానంలో హిందీ
Sakshi Education
- ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ జూన్ 10(శుక్రవారం) బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి.
- ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్ తో పాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తరప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐరాస గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది.
-
చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, జూన్ 10 కరెంట్ అఫైర్స్
-
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Published date : 11 Jun 2022 07:30PM