Daily Current Affairs in Telugu: 2022, జూన్ 10th కరెంట్ అఫైర్స్
Sakshi Education
Current Affairs in Telugu June 10th 2022(డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Ranked five schools from India in the top ten schools in the world: ప్రపంచ తొలి ‘పది’ పాఠశాలల్లో భారత్ నుంచి ఐదు పాఠశాలలకు స్థానం
- ప్రపంచంలో ఉత్తమ పాఠశాలల ఎంపిక కోసం షార్ట్‌లిస్టు చేసిన స్కూళ్ల జాబితాలో భారత్ నుంచి ఐదు పాఠశాలలకు స్థానం దక్కింది. వివిధ కేటగిరీల్లో మొదటి 10 పాఠశాలల్లో ఐదు భారత్‌కు చెందిన పాఠశాలలే కావడం విశేషం. యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లోని ‘టీ4 ఎడ్యుకేషన్’ అనే డిజిటల్ మీడియా వేదిక వివిధ కేటగిరీల్లో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేస్తోంది.
- యాక్సెంచర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, టెంపుల్టన్ వరల్డ్ చారిటీ ఫౌండేషన్, లేమన్ ఫౌండేషన్ సహకారంతో 2,50,000 డాలర్లతో ‘బెస్టు స్కూల్ ప్రైజెస్’ను ఏర్పాటు చేసింది. ఇన్నోవేషన్ కేటగిరీలో ముంబైలోని ఎస్‌వీకేఎమ్స్ సీఎన్‌ఎమ్ స్కూల్, ఢిల్లీలోని ఎస్‌డీఎంసీ ప్రైమరీ స్కూల్‌కు టాప్10లో స్థానం దక్కింది. సామాజిక భాగస్వామ్యం విభాగంలో ముంబైలోని ఖోజ్ స్కూల్, పుణేలోని పీసీఎంసీ ఇంగ్లిష్ మీడియం స్కూల్ చోటు దక్కించుకున్నాయి.
- అవరోధాలను ఎదుర్కొని నిలిచిన స్కూళ్ల జాబితాలో హౌరాలోని సమారిటన్ మిషన్ హైస్కూల్‌కు స్థానం లభించింది. మొత్తం ఐదు కేటగిరీలు ఉండగా, ఒక్కో కేటగిరీలో ఒక అత్యుత్తమ పాఠశాలను ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఎంపిక చేయనున్నారు. బహుమతి కింద ఒక్కో స్కూల్‌కు 50,000 డాలర్ల చొప్పున నగదును అందజేస్తారు.
PM Modi says India’s bio-economy has grown eight times: భారత ’బయో–ఎకానమీ’ ఎనిమిది రెట్లు పెరిగింనది....ప్రధాని మోదీ వెల్లడి
- దేశాన్ని వృద్ధి బాటలో నడిపే క్రమంలో ప్రతీ రంగానికి తోడ్పాటు అందించాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యం లభించేదని, తమ ప్రభుత్వ హయాంలో అన్ని పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎనిమిదేళ్లలో భారత ’బయో–ఎకానమీ’ ఎనిమిది రెట్లు పెరిగిందని, 10 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేరిందని ప్రధాని పేర్కొన్నారు.
- బయోటెక్ వ్యవస్థలో టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరం లేదన్నారు. బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పోను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశీయంగా అంకుర సంస్థల సంఖ్య వందల స్థాయి నుంచి 60 పైగా పరిశ్రమల్లో 70,000 పైచిలుకు చేరిందని మోదీ చెప్పారు.
- కొన్ని రంగాల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ’బయోటెక్ స్టార్టప్స్ ఆవిష్కరణలు: స్వావలంబన భారత్ సాధన దిశగా’ అంశంపై ఈ ఎక్స్‌పో సదస్సు రెండు రోజుల పాటు (జూన్ 9, 10) జరుగుతుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, పరిశ్రమ దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, తయారీదారులు మొదలైన వారం తా కలిసేందుకు ఇది వేదికగా నిలవగలదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Published date : 10 Jun 2022 05:17PM