World AIDS Day 2022: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
2020లో జరిగిన అధ్యయనాల ప్రకారం హెచ్‌ఐవీ రోగుల్లో 40 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. నిజానికి ఎయిడ్స్ ఉన్నా పెళ్లి చేసుకోవచ్చని రోగులు గుర్తించాలి. ఎయిడ్స్‌పై అవగాహన పెంచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి సారిగా 1988 లో ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి నుంచీ ప్రతీ ఏడాదీ డిసెంబర్ 1వ తేదీని ‘ప్రపంచ ఎయిడ్స్ దినం’గా పాటిస్తున్నాము.
PSLV C54: పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం
2030 నాటికి ఎయిడ్స్ అంతం..
ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ‘సంఘీభావంతో – ఎయిడ్స్ నివారణ బాధ్యతల్లో భాగస్వామ్యం కావాలి’ అనే నినాదాన్ని ఇచ్చాయి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2022 యొక్క థీమ్ ‘రాక్ ది రిబ్బన్’. 2030 నాటికి ఎయిడ్స్‌ను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాల కృషి చేస్తున్నాయి. జీవితాంతం మాత్రలు వాడటానికి 70 శాతం రోగులు ఇష్టపడటం లేదు. అందుకే మధ్యలో మందులు ఆపేయడం, అస్తవ్యస్థంగా మందులు వాడడం ద్వారా అర్థాంతరంగా హార్ట్ ఎటాక్ లేదా పక్షవాతం, టీబీ, కేన్సర్లు, అంధత్వం, మెనింజైటీస్, ఇతర అవకాశవాద సంక్రమణ వ్యాధులకు గురవుతూ నిర్వీర్యమై పోతున్నారు.
➤ 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
బీఎన్‌ఏబీఎస్ చికిత్స అందుబాటులోకి..
ఒకప్పుడు ఎయిడ్స్ అంటే మరణవాంగ్మూలం అనేవారు. అయితే నాలుగు దశాబ్దాల్లో శాస్త్రవేత్తలు ఈ వ్యాధిపై విజయం సాధించి చికిత్సను అందుబాటులోకి తెస్తున్నారు. అత్యంతాధునికమైన ‘బ్రాడ్లీ నూట్రలైజింగ్ ఏంటీ బాడీస్’ (బీఎన్‌ఏబీఎస్) చికిత్స త్వరలో అందుబాటులోకి వస్తుంది. మూడు లేక నాలుగు బీఎన్‌ఏబీఎస్‌ల ను కలిపి రోగి శరీరంలోకి పంపిస్తే అవి అన్ని రకాల హెచ్‌ఐవీ స్ట్రెయిన్స్‌నీ పూర్తిగా నిర్మూలిస్తాయని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘నేచర్’ ధ్రువీకరించింది. ‘న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్’లో తాజాగా వెలువడిన పరిశోధన ఫలితాల ప్రకారం ఓకాబ్రియా ఇంజక్షన్ సంవత్సరానికి ఒకటి లేదా రెండు పర్యాయాలిస్తే హెచ్‌ఐవీ సమూలంగా నాశన మవుతుందని తేలింది.
హెచ్‌ఐవీని పూర్తిగా నయం చేయడానికి (సీఆర్‌ఐపీఆర్) ‘క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్’ అని పిలువబడే జీన్ ఎడిటింగ్ విధానానికి అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఏంటీబాడీస్ ఇంజక్షన్లను వాడటం, కిక్ అండ్ కిల్ లాంటి అత్యాధునిక వైద్య విధానాన్ని అనుసరించడం వంటివాటి ద్వారా ఈ రోజో రేపో ఎయిడ్స్‌పై పూర్తి విజయాన్ని మన వైద్యులు ప్రకటించనున్నారు.
చదవండి: చిన్న ఉపగ్రహాల కోసం ఇస్రో రూపొందించిన రాకెట్ పేరు?
హెచ్‌ఐవీ వ్యాప్తి, మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా ఎయిడ్స్ వ్యాధితో 3.5 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. గత సంవత్సరంలో దాదాపు 10 లక్షల మంది హెచ్‌ఐవీ సంబంధిత వ్యాధుల కారణంగా చనిపోయారు. ప్రస్తుతం సుమారు 3.7 కోట్ల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నారు. అందులో 70 శాతం ఆఫ్రికాలోనే ఉన్నారు. అక్కడ ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు భారీ ఎత్తున ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ 900 మంది పిల్లలు పుడుతూనే కొత్తగా హెచ్‌ఐవి బారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఓ వ్యక్తికి హెచ్‌ఐవీ వస్తున్నదని యూనిసెఫ్ తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో 20ఏండ్ల లోపు ఉన్నవారే అధికంగా ఉన్నారని తెలిపింది. 2019లో 3.20 లక్షల మంది హెచ్‌ఐవీ బారినపడగా వారిలో 1.10లక్షల మంది చనిపోయారని పేర్కొంది.
జీవితంలో మొదటిసారి ఫెయిలయ్యా.. కానీ మళ్లీ సక్సెస్ కోసం మాత్రం..