Skip to main content

PSLV C54: పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నవంబర్‌ 26న ప్రయోగించిన 44 మీటర్ల ఎత్తయిన పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది.

ఈ రాకెట్‌ 1,117 కేజీల ఎర్త్‌ ఆబ్జర్వేషన్‌ శాటిలైట్‌ ఓషన్‌శాట్‌–03(ఈవోఎస్‌6) సహా మొత్తం 1,171 కేజీల తొమ్మిది ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. భిన్న బరువుల ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి చేర్చేందుకు తొలిసారిగా రాకెట్‌లో రెండు ఆర్బిట్‌ చేంజ్‌ థ్రస్టర్ల(ఓసీటీ)ను వాడారు.  నుంచి 87వదికాగా, పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌తో ఇది 56వ ప్రయోగం.
ఈ ప్రయోగం ద్వారా స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకాస్ట్‌ సంస్థకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, బెంగళూరుకు చెందిన పిక్సెల్‌ ఇండియా వారి ఆనంద్‌ శాటిలైట్, హైదరాబాద్‌కు చెందిన ధృవస్పేస్‌ వారి కిలోన్నర బరువైన రెండు థైబోల్ట్‌ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. మొదట 742 కి.మీ.ల ఎత్తుకు వెళ్లి అక్కడ ఓషన్‌శాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత కిందకు దిగొచ్చి 516–528 కి.మీ.ల ఎత్తులో విస్తరించిన సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో వేర్వేరు స్థాయిల్లో మిగతా వాటిని ప్రవేశపెట్టారు. ఇందుకోసం వేర్వేరుగా రెండు ఆర్బిట్‌ ఛేంజ్‌ థ్రస్టర్లను వాడారు. భారత్‌–భూటాన్‌ సంయుక్తంగా తయారుచేసిన ఐఎన్‌ఎస్‌–2బీ ఉపగ్రహాన్నీ ఇక్కడి కక్ష్యలోనే ప్రవేశపెట్టారు. ఆస్ట్రోకాస్ట్‌ ఉపగ్రహాల్లో అమెరికాకు చెందిన స్పేస్‌ఫ్లైట్‌ వారి పేలోడ్లను వాడారు. 
విజయవంతంగా కక్ష్యలోకి..
ఓషన్‌శాట్‌–3 నుసముద్రాల మీద అధ్యయనం కోసం ప్రయోగించామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. ‘‘చేపల వేటకు అనువైన ప్రాంతాల గుర్తింపు, భారత తీర, సముద్రప్రాంత భద్రత, తుపాన్ల గమనాలు తదితరాల కోసం ఓషన్‌శాట్‌ను ప్రయోగించాం. ఇండియా–భూటాన్‌ సంయుక్తంగా తయారు చేసిన ఐఎన్‌ఎస్‌2బీలోని పేలోడ్లు మానవ వనరులు, డిజిటల్‌ టెక్నాలజీని మరింతగా పెంపొందించుకునేందుకు ఉపయోగపడతాయి. ఉపగ్రహాలన్నీ విజయవంతంగా కక్ష్యల్లోకి చేరాయి’’ అన్నారు. ఐఎన్‌ఎస్‌–2బీ ఉపగ్రహ ప్రయోగాన్ని భూటాన్‌కు మన బహుమతిగా విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అభివర్ణించారు. స్పేస్‌ సైన్స్‌ విషయంలో భూటాన్‌కు మరింత సాయమందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. మరోసారి ఘనవిజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. 

Astronomy: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీ పేరు?
 

Published date : 28 Nov 2022 11:46AM

Photo Stories