PAK New Interim PM: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా కకర్
Sakshi Education
పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వరుల్ హక్ కకర్(52) ఆగస్టు 14న పదవీ ప్రమాణం చేశారు.
ఆగస్టు 14న అధ్యక్ష భవనంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో కకర్‌తో అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ప్రమాణం చేయించారు. బలూచిస్తాన్ అవామీ పార్టీ (BAP) చెందిన అన్వరుల్ హక్ కాకర్ ఈ ఏడాది చివర్లో జరిగే సాధారణ ఎన్నికల వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, జాతీయ అసెంబ్లీ పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియక ముందే రద్దు చేస్తే 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించవచ్చు.
Published date : 16 Aug 2023 05:26PM