Skip to main content

PAK Interim PM: పాక్‌ ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్‌ దార్‌!

పాకిస్తాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రి ఇషాఖ్‌ దార్‌ (73) పేరు తెరపైకి వచ్చింది.
PAK Interim PM

షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వ పదవీ కాలం ఆగస్టు 14న ముగియనుంది. కానీ 8వ తేదీనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు పాక్‌ మీడియా ఆదివారం వెల్లడించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఇషాఖ్‌ దార్‌ను ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగిస్తారని తెలియజేసింది.

☛☛ Sri Lanka President Visits India: లంకకు స్నేహహస్తం

ఆయన పేరును అధికార పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ పార్టీ ప్రతిపాదించింది. పాకిస్తాన్‌ రాజ్యాంగం ప్రకారం,  జాతీయ అసెంబ్లీ పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియక ముందే రద్దు చేస్తే 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించవచ్చు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే దాకా ఆపద్ధర్మ ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్‌ దార్‌ నియామకంపై పాకిస్తాన్‌ ప్రభుత్వం వచ్చేవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

☛☛​​​​​​​Daily Current Affairs in Telugu: 22 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

 

Published date : 24 Jul 2023 01:29PM

Photo Stories