Daily Current Affairs in Telugu: 22 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి జులై 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని షార్ వర్గాలు తెలిపాయి.
2. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది వినియోగదారులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
3. భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
☛☛ Daily Current Affairs in Telugu: 21 జులై 2023 కరెంట్ అఫైర్స్
4. రాష్ట్రంలోని మొత్తం వయోజన జనాభాకు వేతనాలు లేదా పింఛను హామీని అందించే లక్ష్యంతో రాజస్థాన్ అసెంబ్లీ ‘రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు, 2023’ని ఆమోదించింది.
5. ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్‌లో జరుగుతున్న ఆసియా స్కూల్స్ ర్యాపిడ్ అండ్ చెస్ చాంపియన్‌షిప్–2023లో తెలంగాణ ఆటగాళ్లు విఘ్నేశ్ అద్వైత్ వేముల, యశ్వి జైన్ పతకాలు సాధించారు.
6. ప్రపంచంలో అతి పెద్ద బియ్యం సరఫరాదారుగా ఉన్న భారత్ పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచేందుకు ఎగుమతులను నిషేధించింది.
☛☛ Daily Current Affairs in Telugu: 20 జులై 2023 కరెంట్ అఫైర్స్