India's Rice Exports Ban: బియ్యం ఎగుమతులను నిషేధించిన భారత్
ఈ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యాలు కూడా ఈ ప్రభావానికి గురయ్యాయి.
ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40% వాటా కలిగి ఉన్న ఇండియా ఎగుమతులను నిలిపివేయడంతో ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఒక మెట్రిక్ టన్ను ధరలు కనిష్టంగా 50 డాలర్లు నుంచి 100 డాలర్లు ఎక్కువ ఉండవచ్చని సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ వ్యాపార సంస్థలో ఒక వ్యాపారి వెల్లడించారు.
☛☛ Social Media Active Users: సోషల్ మీడియా యాక్టివ్ యూజర్లు 500 కోట్లు
బియ్యం ఎగుమతులను నిషేధించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ గోధుమ మార్కెట్‌లో బలమైన లాభాలను తీసుకు వస్తోంది. ఈ కారణంగానే గోధుమ ధరలు కూడా ఈ వారంలో 10 శాతం కంటే ఎక్కువ పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది వరి మీద ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 90 శాతం నీటి ఆధారంగా పెరిగే ఈ పంట దాదాపు ఎక్కువ భాగం ఆసియా ఖండంలో ఉత్పత్తవుతుంది.
ఇక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఎగుమతిదారు అయిన థాయ్‌లాండ్, కొత్త ఒప్పందాలపై సంతకం చేయడానికి ముందు ధరలను తెలుసుకోవడానికి సరఫరాదారులు వేచి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వియాత్నం, సింగపూర్ వంటి దేశాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
☛☛ Rajasthan minimum income Bill: రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు, 2023