Skip to main content

Cave on Moon : చంద్రుడిపై భారీ గుహ.. ఎక్క‌డ ఉంటుంది..!

Italian Scientists confirmed about the Cave on Moon

చంద్రుడిపై ఒక గుహ ఉందని ఇటలీ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. ఈ గుహ వెడల్పు కనీసం 40 మీటర్లు ఉంటుందని, పొడవు మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. భవిష్యత్తులో జాబిల్లిపైకి పంపే వ్యోమగాములకు దీనిని షెల్టర్‌గా వాడొచ్చునని వెల్లడించింది. అగ్నిపర్వతం వెదజల్లిన లావా కారణంగా ఈ బిలం ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు పేర్కొన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’.. 1969లో ప్రయోగించిన ‘అపోలో–11’.. చంద్రుడిపై దిగిన ప్రదేశానికి సమీపంలోనే ఈ గుహ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Nepal PM: నేపాల్ ప్రధానిగా.. ఓలి రెండేళ్లు, దేవ్‌బా ఒకటిన్నర సంవ‌త్స‌రం!

Published date : 24 Jul 2024 10:35AM

Photo Stories