Skip to main content

Govt Jobs: 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు.. ఎక్క‌డంటే..!

ఆర్థిక సంక్షోభం నేపథ్యంగా.. పాకిస్థాన్ సర్కార్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి లోన్ పొందేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది.
Pakistan cuts 150K government jobs, dissolves six ministries as part of IMF deal

పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేయడం, రెండు శాఖలను విలీనం చేయడం జరుగుతుండటంతో, ఐఎంఎఫ్‌ పాకిస్థాన్‌కు 7 బిలియన్ డాలర్లు రుణంగా ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందులో తొలి విడతగా 1 బిలియన్ డాలర్లు విడుదలయ్యాయి.

2023లో పాకిస్థాన్ దివాళా దిశగా వెళ్ళినప్పటికీ, ఐఎంఎఫ్‌ ద్వారా అందిన మూడు బిలియన్ డాలర్ల సహాయంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడింది. అయితే.. ఇది చివరిసారి అంటూ, పాకిస్థాన్ ఐఎంఎఫ్‌తో దీర్ఘకాలిక రుణం కోసం చర్చలు జరిపింది. సెప్టెంబర్ 26వ తేదీ ఐఎంఎఫ్‌ ప్యాకేజీ ఆమోదించింది. 

అందులో పన్ను-జీడీపీ నిష్పత్తిని పెంచడం, ఖర్చులు తగ్గించడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై పన్నులు, రాయితీలు తగ్గించడం వంటి చర్యలకు పాకిస్థాన్ హామీ ఇచ్చింది.

Job Layoffs: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీలో కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు!!

పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి మహమ్మద్ ఔరంగజేబు, ఐఎంఎఫ్‌ ప్యాకేజీపై ధన్యవాదాలు తెలుపుతూ.. "ఇది ప్రభుత్వ చివరి ప్యాకేజీ అని నిరూపించేందుకు మేము విధానాలను అమలు చేయాలి" అని పేర్కొన్నారు. అలాగే.. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 32 లక్షలకు చేరగా, మునుపటి 16 లక్షలతో పోలిస్తే మెరుగుదలగా ఉందని తెలిపారు. ఇకపై పన్నులు చెల్లించని వారు ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయలేరని స్పష్టం చేశారు.

Published date : 01 Oct 2024 12:01PM

Photo Stories