G20 Countries: ఏ దేశ అధ్యక్షతన జీ20 ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది?
ఇండోనేషియా అధ్యక్షతన ఏప్రిల్ 21న జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశం జరిగింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ భవిష్యత్ ఆర్థిక వృద్ధి తీరు, రిస్క్‌లు, అంతర్జాతీయ ఆరోగ్యం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ.. ఆర్థిక వ్యవస్థలను కాపాడేందుకు చురుకైన, ఉమ్మడి చర్యల అవసరం ఉందన్నారు.
Semicon India Conference 2022: సెమీకాన్ ఇండియా తొలి సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?
క్రిస్టలీనా జార్జీవాతో భేటీ
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఏప్రిల్ 18న వాషింగ్టన్‌కు నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా జార్జీవాతో భేటీ అయ్యారు. అలాగే, అమెరికా వాణిజ్య మంత్రి గినారాయ్‌మోండోతో చర్చలు నిర్వహించారు. ఆర్థిక సహకార విస్తృతికి గల మార్గాలపై చర్చించారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీఈవో జాన్ నెఫర్ తోనూ సీతారామన్ సమావేశమయ్యారు.
DGCIS: 2021–22లో భారత్ ఎన్ని దేశాలకు బియ్యం ఎగుమతి చేసింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండోనేషియా అధ్యక్షతన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశం నిర్వహణ
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : అంతర్జాతీయ భవిష్యత్ ఆర్థిక వృద్ధి తీరు, రిస్క్‌లు, అంతర్జాతీయ ఆరోగ్యం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్