Skip to main content

Plastic: ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ నంబర్‌ వన్

ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉందని కొత్త అధ్యయనం ఒకటి పేర్కొంది.
India Number one in The World in Plastic Waste Production

ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ మొద‌టి స్థానంలో ఉంది. దేశంలో ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది రెండవ అతిపెద్ద ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారు కంటే రెండు రెట్లు అధికం. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ గ్లోబల్ సౌత్ నుంచి వస్తుంది. 

ఈ అధ్యయనాన్ని నిర్వహించిన కోస్టాస్ వెలిస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఒకచోట చేరిస్తే, అది న్యూయార్క్ నగరంలోగల సెంట్రల్ పార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తుకంటే అధికంగా ఉంటుంది. పరిశోధకులు ఈ అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 50 వేలకు పైగా నగరాలు, పట్టణాలలో స్థానికంగా ఉత్పత్తి అయిన వ్యర్థాలను పరిశీలించారు.

Palmyra Atoll: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి ఇదే.. కానీ ఇక్కడ ఒక్కరు కూడా..

ఈ అధ్యయన ఫలితాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం బహిరంగ వాతావరణంలో కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించింది. ప్రపంచ జనాభాలో 15 శాతం మంది నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పారవేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఆగ్నేయాసియా, సబ్-సహారా ఆఫ్రికాలో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తికి ఇదే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. ఈ 15 శాతం జనాభాలో భారతదేశంలోని 25.5 కోట్ల మంది ఉన్నారు.

నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ కాలుష్యాన్ని విడుదల చేస్తోంది. ఇదేవిధంగా న్యూఢిల్లీ, లువాండా, అంగోలా, కరాచీ, ఈజిప్ట్‌లోని కైరోలు ప్లాస్టిక్ కాలుష్య కారకాల విడుదలలో అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా ఈ విషయంలో నాల్గవ స్థానంలో ఉంది. వ్యర్థాలను తగ్గించడంలో ఆ దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని వెల్లడయ్యింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్‌ దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాల నుంచి ప్రపంచంలోని సగానికి పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికా 90, బ్రిటన్‌ 135వ స్థానంలో ఉన్నాయి.

Diamond: 2,492 క్యారెట్ల వజ్రం లభ్యం.. ఇంత భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారి!!

Published date : 06 Sep 2024 05:44PM

Photo Stories