Diamond: 2,492 క్యారెట్ల వజ్రం లభ్యం.. ఇంత భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారి!!
తమ గనుల్లో ఇంతటి భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారని బొట్స్‌వానా ప్రభుత్వం తెలిపింది. దీని బరువు 2,492 కేరట్లని వివరించింది. కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కరోవె గనిలో ఈ అరుదైన ముడి వజ్రం లభించింది.
ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద వజ్రమని లుకారా డైమెండ్ కార్పొరేషన్ తెలిపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం వందేళ్లలో ఇదే మొదటిసారని పేర్కొంది.
గతంలో 1905లో దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కల్లినాన్ డైమండ్ బయటపడింది. 3,106 కేరట్లున్న ఆ భారీ వజ్రాన్ని 9 భాగాలు చేశారు. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్ రాజవంశీకుల ఆభరణాల్లో వాడారు. 1800లో బ్రెజిల్‌లో అతిపెద్ద బ్లాక్ డైమండ్ దొరికింది. అయితే.. ఇది భూ ఉపరితలంలోనే లభించింది. ఇది ఉల్కలో భాగం కావొచ్చని నమ్ముతున్నారు. మొత్తం 20 శాతం వరకు వాటా బొట్స్‌వానా గనులదే.
Research on Mars : అంగారక గ్రహం పరిశోధనలో వెలుగులోకోచ్చిన కీలక విషయం..
ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడి గనుల్లో భారీ వజ్రాలు లభించాయి. 2019లో కరోవె గనిలోనే 1,758 కేరట్ల సెవెలో వజ్రాన్ని తవ్వి తీశారు. దీనిని ఫ్రాన్సుకు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టన్ కొనుగోలు చేసింది. అయితే, ధరను వెల్లడించలేదు. కరోవె గనిలోనే 1,111 కేరట్ల లెసెడి లా రొనా అనే డైమండ్ లభ్యమైంది. దీనిని, బ్రిటిష్ ఆభరణాల సంస్థ 2017లో 5.30 కోట్ల డాలర్ల(సుమారు రూ.440 కోట్లు)కు దక్కించుకుంది.