DGCIS: 2021–22లో భారత్ ఎన్ని దేశాలకు బియ్యం ఎగుమతి చేసింది?
ప్రపంచ దేశాల ఆకలిని తీర్చడంలో ముందున్న భారత్ బాస్మతియేతర బియ్యం ఎగుమతుల్లోనూ దూసుకుపోతోందని కేంద్రం పేర్కొంది. 2013–14తో పోలిస్తే ఏకంగా 109 శాతం వృద్ధి సాధించిందని ఏప్రిల్ 20న వెల్లడించింది. 2013–14లో భారత నాన్ బాస్మతి బియ్యం ఎగుమతుల విలువ 292 కోట్ల డాలర్లు కాగా 2021–22లో 611 కోట్ల డాలర్లకు పెరిగిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీజీసీఐఎస్) తెలిపింది. డీజీసీఐఎస్ తెలిపిన వివరాల ప్రకారం...
- 2021–22లో 150 దేశాలకు భారత్ బియ్యం ఎగుమతి చేసింది. వీటిలో 76 దేశాలకు మిలియన్ టన్నుల కంటే ఎక్కువ బియ్యం వెళ్లాయి.
- ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిసా, అసోం, హరియాణా రాష్ట్రాల్లో ఎక్కుగా వరి ఉత్పత్తి జరుగుతోంది.
- కరోనా సవాలును అధిగమించి మరీ ఆఫ్రికా, ఆసియా, యూరప్ మార్కెట్లలో బియ్యం ఎగుమతుల్లో భారత్ పై చేయి సాధిస్తూనే ఉంది. ప్రపంచ బియ్యం వాణిజ్యంలో అత్యధిక వాటా సాధించింది.
National Civil Services Day 2022: సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్