Pulses Producing: పప్పుధాన్యాల ఉత్పత్తిలో టాప్-10లో ఉన్న దేశాలు ఇవే..
28 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో.. భారత్ ప్రపంచ పప్పుధాన్యాల ఉత్పత్తిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. గత 20 సంవత్సరాల్లో.. 2002లో 11.13 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి ఈ ఉత్పత్తి రెట్టింపు అయ్యింది.
పప్పులు, పెసరపప్పు, కందిపప్పు, బీన్స్, బఠానీలు సహా, ప్రపంచ పోషణ మరియు వ్యవసాయానికి అవసరమైనవి. ప్రపంచంలోని ప్రముఖ పప్పుధాన్యాలు ఉత్పత్తి చేసే దేశాలు ఈ ప్రోటీన్-రిచ్ పంటలకు ఉన్న డిమాండ్‌ను తీర్చడంలో ప్రాథమికమైనవి.
ప్రపంచవ్యాప్తంగా పప్పుధాన్యాల ఉత్పత్తి
2022లో, ప్రపంచవ్యాప్తంగా పప్పుధాన్యాల సాగు దాదాపు 9.6 మిలియన్ హెక్టార్లలో సాగించబడింది. ఇది హెక్టారుకు సగటున 1,015 కిలోగ్రాముల ఉత్పత్తితో 9.7 మిలియన్ టన్నుల దిగుబడిని ఇచ్చింది. పప్పులు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలలో సాగు చేయబడుతున్నాయి. ఇవి ప్రపంచ వ్యవసాయం, ఆహార భద్రతలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.
Deepest Lakes: ప్రపంచంలోని లోతైన టాప్ 10 సరస్సులు ఇవే..
ప్రపంచంలోని టాప్-10 పప్పు ఉత్పత్తి దేశాలు ఇవే..
ర్యాంక్ | దేశాలు | పప్పుధాన్యాల ఉత్పత్తి (మిలియన్ మెట్రిక్ టన్నులలో) |
---|---|---|
1 | భారతదేశం | 28 |
2 | మయన్మార్ | 5.5 |
3 | కెనడా | 5.1 |
4 | చైనా | 5 |
5 | రష్యా | 4.1 |
6 | నైజీరియా | 4 |
7 | నైజర్ | 3.5 |
8 | ఇథియోపియా | 3.47 |
9 | బ్రెజిల్ | 2.9 |
10 | యునైటెడ్ స్టేట్స్ | 2 |