Skip to main content

Indian Workers: చలో తైవాన్.. భారతీయుల‌కు లక్షల్లో ఉద్యోగాలు!!

భారత్, తైవాన్ మధ్య బంధం బలపడుతోంది.
India Taiwan sign MoU To Bring Indian Workers Amid Worst Labour Shortage

ఇందులో భాగంగానే తైవాన్ దేశంలో ఇండియన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఇరు దేశాలు ఇటీవలే ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిని తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. 
చైనా దురాక్రమణలను తిప్పికొట్టేందుకు తైవాన్.. భారత్, అమెరికా దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోంది. ముఖ్యంగా ఇండియాతో తైవాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తూ.. ఇరు దేశాలకు ఉపయోగకరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. 

తైవాన్ దేశంలో జననాల రేటు తక్కువగా ఉండటంతో 2025 నాటికి 20 శాతం వృద్ధ జనాభా ఉంటారని, కార్మికుల కొరత గణనీయంగా పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే తైవాన్ ప్రస్తుతం వలస కార్మికుల మీద ఆధారపడుతోంది. ఇప్పటికే థాయ్‌లాండ్, ఇండోనేసియా, ఫిలిప్ఫిన్స్, వియత్నాం దేశాలకు చెందిన సుమారు 7 లక్షల మంది తైవాన్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.

Nuclear Power Plants: అణు విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం.. 4 వేల మందికి దొరక‌నున్న ఉద్యోగాలు..

తైవాన్‌ తమ దేశంలోని ఫ్యాక్టరీలు, వ్యవసాయ క్షేత్రాలు, హాస్పిటళ్లలో పనిచేసేందుకు లక్ష మంది దాకా భారత్‌కు చెందిన వర్కర్లను నియమించుకోనున్నట్లు గతంలోనే వెల్లడించింది. అనుకున్న విధంగానే ఇప్పుడు రెండు దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. అంటే భారతీయులకు రానున్న రోజుల్లో తైవాన్‌ భారీగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు స్పష్టమవుతోంది.

 

 

Published date : 20 Feb 2024 12:14PM

Photo Stories