Nuclear Power Plants: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం.. 4 వేల మందికి దొరకనున్న ఉద్యోగాలు..
Sakshi Education
ఇరాన్ ప్రభుత్వం మొత్తం 5 వేల మెగా వాట్ల సామర్థ్యం ఉండే నాలుగు అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది.
దేశ తూర్పు తీర పట్టణం సిరిక్ సమీపంలో వీటి నిర్మాణం మొదలైందని ఇరాన్ అణు విభాగం అధిపతి మహ్మద్ ఎస్లామి తెలిపినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది.
సుమారు 20 బిలియన్ డాలర్ల(సుమారు రూ.1.64 లక్షల కోట్లు) వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుతో 4 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ఎస్లామి చెప్పారు. తొమ్మిదేళ్లలో వీటి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఆ తర్వాత ఏటా 35 టన్నుల అణు ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. రష్యా సహకారంతో నిర్మించిన వెయ్యి మెగావాట్ల అణుప్లాంట్ ఇరాన్‌లో ఇప్పటికే పనిచేస్తోంది.
California schools: కాలిఫోర్నియాలో కలిపిరాత మస్ట్.. ఎందుకు అంటే..?
Published date : 03 Feb 2024 10:10AM