Hezbollah Fires: ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్లు
Sakshi Education
లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లు జనవరి 6వ తేదీ ఇజ్రాయెల్‌పైకి పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు.
బీరుట్‌లో ఉన్న హమాస్ అగ్ర నేత సలెహ్ అరోరీని చంపినందుకు ప్రతీకారం తప్పదంటూ జనవరి 5న హెజ్బొల్లా నేత సయ్యద్ హస్సన్ నస్రల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 62 రాకెట్లను ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరోన్‌లో ఉన్న గగనతల నిఘా కేంద్రంపైకి ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. ఇవి ఆ కేంద్రాన్ని నేరుగా తాకాయని పేర్కొంది.
మెరోన్ వైపు 40 రాకెట్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే, నష్టం గురించి ప్రస్తావించలేదు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై జరిపిన దాడుల్లో 122 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 22,722కు చేరుకుందని పేర్కొంది. మృతుల్లో మూడింట రెండొంతుల మంది చిన్నారులు, మహిళలేనని వెల్లడించింది. మరో 58,166 మంది క్షతగాత్రులుగా మిగిలారని పేర్కొంది.
BRICS: బ్రిక్స్ కూటమిలోకి చేరిన ఐదు దేశాలు ఇవే..
Published date : 09 Jan 2024 09:21AM