BRICS: బ్రిక్స్ కూటమిలోకి చేరిన ఐదు దేశాలు ఇవే..
ఈ కూటమిలోకి కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వచ్చి చేరాయి. ఈ దేశాలకు సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రస్తుతం బ్రిక్స్ పది దేశాల కూటమిగా అవతరించిందని, ఇది మరింతగా విస్తరించనుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మరో 30 దేశాలు బ్రిక్స్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజకీయ, భద్రత, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, మానవత్వ సేవల రంగాల్లో బ్రిక్స్ కలిసి పనిచేస్తోందని తెలిపారు.
2023 ఆగస్టులో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మొత్తం 6 దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అర్జెంటీనాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తాము బ్రిక్స్‌లో చేరబోమని ప్రకటించారు. దీంతో ఐదు దేశాలకే సభ్యత్వం ఇచ్చారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్‌గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది.