Skip to main content

Anwar Ibrahim: మలేసియా ప్రధానిగా అన్వర్‌ ఇబ్రహీం

మలేసియా సీనియర్‌ నేత, సంస్కరణలవాదిగా పేరున్న అన్వర్‌ ఇబ్రహీం(75) ఆ దేశ నూతన ప్రధానమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 112 సీట్లు కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్వర్‌ నేతృత్వంలోని అలయెన్స్‌ ఆఫ్‌ హోప్‌ 82 సీట్లు గెలుచుకుంది.

ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కక హంగ్‌ ఏర్పడటంతో రాజు జోక్యం చేసుకున్నారు. అన్వర్‌ సారథ్యంలోని ఐక్య కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు బద్ధ వ్యతిరేకి, దీర్ఘకాలం అధికారంలో ఉన్న యునైటెడ్‌ మలయీస్‌ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ అనూహ్యంగా ముందుకు వచ్చింది. దీంతో సందిగ్ధానికి తెరపడింది. నేషనల్‌ ప్యాలెస్‌లో గురువారం రాజు సుల్తాన్‌ అహ్మద్‌ షా ప్రధానిగా అన్వర్‌తో ప్రమాణం చేయించారు.  

➤ వివిధ దేశాధినేతలుగా ఎలుతున్న మ‌న‌ భారత సంతతి వ్యక్తులు వీరే..?
 

Published date : 25 Nov 2022 12:01PM

Photo Stories