Skip to main content

World Organ Donation Day: ఆగస‍్టు 13వ తేదీ ప్రపంచ అవయవ దాన దినోత్సవం..

బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం.
World Organ Donation Day History and Significance

కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస‍్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. 

2024 ప్రపంచ అవయవదాన దినోత్సవం నినాదం: "నేడు ఎవరికైనా నవ్వును కలిగించే కారణం మీరై ఉండండి!". ఈ నినాదం అవయవదానం అవసరం గురించి అవగాహన పెంచడం, వ్యక్తులు అవయవదాతలుగా మారాలనే స్ఫూర్తిని కలిగించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

తొలి అవయవదానం..
ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం.. 1954లో అమెరికాలోని బోస్టన్‌లోని పీటర్‌ బెంట్‌ బ్రీగమ్‌ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్‌ అనే ‍వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్‌ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశాడు. సోదరుడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే లీ హెర్రిక్‌ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 1954లో జరిగిన ఈ ఆపరేషన్‌ విజయవంతం అయ్యింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఎనిమిదేళ్ల పాటు జే హెర్రిక్‌ జీవించాడు. ఇక కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్‌ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో చనిపోయాడు(వృద్ధాప్య సంబంధిత సమస్యలతో). ఇక ఆపరేషన్‌ని సక్సెక్స్‌ చేసిన డాక్టర్‌ జోసెఫ్‌ ముర్రే.. తర్వాత కాలంలో నోబెల్‌ బహుమతి పొందాడు.

భారతదేశంలో.. అవయవ దానం నియంత్రణకు మూలస్తంభం మానవ అవయవాలు & కణజాల మార్పిడి చట్టం 1994. ఈ చట్టం దేశంలో అవయవదానం & మార్పిడికి సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ అందిస్తుంది. జాతీయ అవయవ దినోత్సవాన్ని నవంబర్ 27వ తేదీ జరుపుకున్నారు.

Nelson Mandela International Day: జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

ప్రమాదం లేదు..
హెర్రిక్‌ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే నలభై మూడు వేలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. 

ఎనిమిది రకాల అవయవాలు..
ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్‌, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్‌, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. ఇక బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో ఎనిమిది మందికి ప్రాణాలను కాపాడే వీలుంది.

జీవన్‌దాన్‌ ట్రస్ట్‌..
అవయవమార్పడి కోసం కేంద్రం జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల సమాచారం ఈ ట్రస్ట్‌కి అందిస్తే వారు అవయవాలు సేకరించి అవసరం ఉన్న రోగులకు కేటాయిస్తుంటారు.

World Population Day 2024: జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

Published date : 13 Aug 2024 06:36PM

Photo Stories