World Mosquito Day: ఆగస్టు 20వ తేదీ ప్రపంచ దోమల దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
ఈ రోజున దోమల కారణంగా వచ్చే వ్యాధులపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తుంటారు.
వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఇదే సమయంలో దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, జికా వైరస్ తదితర వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమకాటు కారణంగా లక్షల మంది అనారోగ్యానికి గురవుతుంటారు. అందుకే ఇటువంటి సమయంలో ప్రజలు ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.
దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల నివారణకు సంబంధించిన ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. దోమల కారణంగా మలేరియా వ్యాపిస్తుందని 1897లో శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రారంభించింది.
World Photography Day: ఆగస్టు 19వ తేదీ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
ప్రపంచ దోమల దినోత్సవం-2024ను ‘మరింత మెరుగైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని తీవ్రతరం చేయడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.
దోమల నివారణకు కలుషితమైన నీటి వినియోగాన్ని నివారించాలి. దోమలు తేమగా ఉండే ప్రదేశాలలోను, నీరు నిలిచే ప్రదేశాలలోను త్వరగా వృద్ధి చెందుతాయి. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు దోమ తెరలు లాంటివి వినియోగించడం ఉత్తమం.
World Organ Donation Day: ఆగస‍్టు 13వ తేదీ ప్రపంచ అవయవ దాన దినోత్సవం..