Skip to main content

World Heritage sites in India: దేశంలోని టాప్ వార‌స‌త్వ ప్ర‌దేశాలు ఏంటో మీకు తెలుసా... మొత్తం ఎన్ని ప్ర‌దేశాలు ఉన్నాయంటే..!

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18ని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా పాటిస్తారు. మానవ విజయాలను గౌరవించడం, ప్రపంచ సాంస్కృతిక, సహజ వనరుల పరిరక్షణను ప్రోత్సహించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వ‌హిస్తు ఉంటారు. సాంస్కృతిక వారసత్వాన్ని హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవంలో భాగంగా ఒక థీమ్ ని నిర్ణ‌యిస్తారు. ఈ ఏడాది థీమ్ 'హెరిటేజ్ మార్పులు' గా యునెస్కో ప్ర‌క‌టించింది.
Rani Ki Vav, Patan, Gujarat
Rani Ki Vav, Patan, Gujarat

భార‌త‌దేశంలో మొత్తం 40 ప్ర‌దేశాల‌ను వార‌స‌త్వ ప్ర‌దేశాలుగా యునెస్కో గుర్తించింది. ఈ 40 ప్ర‌దేశాల‌లో 32 సాంస్కృతిక ప్రదేశాలు, 7 సహజ ప్రదేశాలు, 1 మిక్స్‌డ్ ఉన్నాయి. అలాగే వార‌స‌త్వ ప్ర‌దేశాలు అత్య‌ధికంగా ఉన్న దేశాల్లో మ‌న దేశం 6వ స్థానంలో ఉంది. యునెస్కో వార‌స‌త్వ ప్ర‌దేశంగా ప్ర‌క‌టిస్తే ఆ ప్రాంతానికి ప‌ర్యాట‌కులు క్యూ క‌డుతుంటారు. ప‌ర్యాట‌కంగా ఆ ప్రాంతం గ‌ణ‌నీయంగా అభివ‌`ద్ధి చెందుతుంది. 

చ‌ద‌వండి: ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చిన కాగ్నిజెంట్‌... 3,500 మందిని తొల‌గిస్తూ నిర్ణ‌యం

యునెస్కో ఎంపిక చేసిన భారతదేశంలోని వారసత్వ ప్రదేశాల జాబితా ఇదే...

Taj Mahal, Agra

1. తాజ్ మహల్, ఆగ్రా
2. ఖజురహో, మధ్యప్రదేశ్
3. హంపి, కర్ణాటక
4. అజంతా గుహలు, మహారాష్ట్ర

చ‌ద‌వండి: డిప్లొమా అర్హ‌త‌తో ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు... వివ‌రాల కోసం క్లిక్ చేయండి
5. ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర
6. బుద్ధగయ, బీహార్
7. సూర్య దేవాలయం, కోణార్క్, ఒడిశా
8. ఎర్రకోట కాంప్లెక్స్, ఢిల్లీ
9. సాంచి, మధ్యప్రదేశ్
10. చోళ దేవాలయాలు, తమిళనాడు

Khajuraho, Madhya Pradesh
ఖజురహో, మధ్యప్రదేశ్


11. కజిరంగా వన్యప్రాణుల అభయారణ్యం, అస్సాం
12. తమిళనాడులోని మహాబలిపురంలోని స్మారక చిహ్నాల సమూహం
13. సుందర్బన్స్ నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్
14. హుమాయూన్ సమాధి, న్యూఢిల్లీ
15. జంతర్ మంతర్, జైపూర్, రాజస్థాన్

చ‌ద‌వండి: నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుద‌ల... అడ్మిన్‌కార్డు కోసం క్లిక్ చేయండి
16. ఆగ్రా కోట, ఉత్తరప్రదేశ్
17. ఫతేపూర్ సిక్రీ, ఉత్తరప్రదేశ్
18. రాణి కీ వావ్, పటాన్, గుజరాత్
19. కర్ణాటకలోని పట్టడకల్ స్మారక చిహ్నాల సమూహం
20. ఎలిఫెంటా గుహలు, మహారాష్ట్ర

Chola Temples, Tamil Nadu
చోళ దేవాలయాలు, తమిళనాడు


21. నలంద విశ్వవిద్యాలయం, బీహార్
22. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్), మహారాష్ట్ర
23. మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా
24. కుతుబ్ మినార్ దాని స్మారక చిహ్నాలు, న్యూఢిల్లీ
25. చంపానేర్-పావగఢ్ పురావస్తు పార్కు, గుజరాత్
26. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, హిమాచల్ ప్రదేశ్
27. రాజస్థాన్ కొండ కోటలు
28. గోవాలోని చర్చిలు, కాన్వెంట్లు
29. మధ్యప్రదేశ్లోని భీంబెట్కా రాక్ షెల్టర్స్
30. మానస్ వన్యప్రాణి అభయారణ్యం, అస్సాం

చ‌ద‌వండి: మే అంతా ప‌రీక్షా కాలం.. 7 పరీక్షలు ఈ నెల‌లోనే... రూల్స్ మార్చేసిన టీఎస్‌పీఎస్‌సీ

The Pink City - Jaipur
పింక్ సిటీ - జైపూర్


31. కియోలాదేవ్ నేషనల్ పార్క్, భరత్పూర్, రాజస్థాన్
32. నందా దేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్, ఉత్తరాఖండ్
33. పశ్చిమ కనుమలు
34. కాంచన్ జంగా నేషనల్ పార్క్, సిక్కిం
35. క్యాపిటల్ కాంప్లెక్స్, చండీగఢ్
36. చారిత్రాత్మక నగరం అహ్మదాబాద్
37. ది విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబై

చ‌దవండి: ప‌ది, ఇంట‌ర్ అర్హ‌త‌తో ఎన్‌సీఈఆర్‌టీలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే

Fatehpur Sikri, Uttar Pradesh
ఫతేపూర్ సిక్రీ, ఉత్తరప్రదేశ్


38. పింక్ సిటీ - జైపూర్
39. కుంభమేళా
40. ధోలావీరా: హరప్పా నగరం

Published date : 04 May 2023 04:12PM

Photo Stories